Drishyam 3 : మూడో దృశ్యం కూడా వచ్చేస్తోంది.! అతి త్వరలో.!
NQ Staff - August 14, 2022 / 10:27 AM IST

Drishyam 3 : మలయాళ సినిమా ‘దృశ్యం’ తెలుగులోకి అదే పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ తెరకెక్కితే, తెలుగులో ఈ సిరీస్ విక్టరీ వెంకటేష్ చేస్తన్నారు.

Drishyam 3 movie coming soon
మలయాళ వెర్షన్, దానికి మించి తెలుగు వెర్షన్.. సినీ అభిమానుల్ని అలరించాయి. హిందీలో కూడా దృశ్యం తెరకెక్కింది. తమిళంలోనూ దృశ్యం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.
త్వరలో మూడోది.. అధికారిక ప్రకటన రానుంది..
‘దృశ్యం’ సినిమాకి సంబంధించి మూడో సినిమా రాబోతోంది. ‘దృశ్యం-3’ పేరుతో రానున్న ఈ సినిమా కోసం థ్రిల్లింగ్ కాన్సెప్ట్ రెడీ చేశారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. మోహన్ లాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
కాగా, మలయాళ వెర్షన్‌తోపాటే తెలుగు వెర్షన్ కూడా తెరకెక్కించాలనే సన్నాహాల్లో మేకర్స్ వున్నారని సమాచారం. అయితే, ఈ విషయమై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది.
మూడో ‘దృశ్యం’ కోసం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమలు ఎదురుచూస్తున్నాయి. ఆ కాన్సెప్ట్‌కి వున్న క్రేజ్ అలాంటిది మరి.!