Tollywood : ఈ ముద్దులొలికే చిన్నారి హీరోయిన్ అయ్యింది.. ఎవరో గుర్తు పట్టారా?
NQ Staff - December 1, 2022 / 08:23 PM IST

Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దులొలికే చిన్నారి ఎవరో గుర్తు పట్టగలరా.. మీకు చిన్న హింట్ కూడా ఇస్తున్నాను. ఈ పాప టాలీవుడ్ కి చెందిన ఒక పెద్ద కుటుంబానికి చెందిన పాప.. ఈమె హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది.
ప్రస్తుతం ఫిలిం మేకింగ్ పై దృష్టి పెట్టింది. ఆ మధ్య పెళ్లి చేసుకొని గృహిణిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈమె నిర్మించిన ఒక వెబ్ సిరీస్ కూడా విడుదల అయింది. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కు ఈమె చెల్లి.
ఇప్పటికే ఈమె ఎవరో మీకు ఐడియా వచ్చి ఉంటుంది.. మీరంతా ఊహించింది నిజమే, మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంది కదా.
ఈమె హీరోయిన్ గా నటించాలని కమర్షియల్ హిట్స్ దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ హీరోయిన్ గా ఈమె సెటిల్ అవ్వలేక పోయింది. దాంతో పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో నిర్మాణంలో అడుగులు వేస్తోంది. వెబ్ సిరీస్ నిర్మించిన ఈమె త్వరలోనే ఒక స్టార్ హీరో తో సినిమా ను కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

Niharika Konidela Very Cute As Child