Oscar : ఆస్కార్ నామినేషన్స్ కోసం జక్కన్న ఎంతగా ఖర్చు చేశాడో తెలుసా?
NQ Staff - January 24, 2023 / 08:56 PM IST

Oscar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అనుకున్నది సాధించాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఆస్కార్ నామినేషన్స్ కోసం దేశం తరపున పంపించక పోవడంతో ఓపెన్ కేటగిరీలో నేరుగా ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ను పలు విభాగాలకు నిలిపాడు.
నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకుంది. అద్భుతమైన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కడం మాత్రమే కాకుండా ఆస్కార్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
మన సినిమా పాట ఆస్కార్ లో అంత ఈజీగా నామినేట్ అవ్వలేదు. దేశం తరపున అధికారికంగా పంపించక పోవడంతో జక్కన్న చాలా కష్టపడ్డాడు. ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఖర్చు చేశాడట. అంతటి ఖర్చు ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా పెట్టలేదట.
అంతర్జాతీయ స్థాయిలో పబ్లిసిటీ దక్కితేనే ఆస్కార్ నామినేషన్స్ కు ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి స్క్రీన్స్ లో స్క్రీనింగ్ మొదలుకుని ప్రతి విషయంలో కూడా కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రాజమౌళి ఆస్కార్ వరకు ఆర్ ఆర్ ఆర్ ను తీసుకు వెళ్లాడు.
ఇక నుండి మళ్లీ ఖర్చు ఉంటుందని తెలుస్తోంది. ఇంతటి ఘనత సాధించిన ఆర్ ఆర్ ఆర్ కు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ప్రమోషన్ ఖర్చులు చెల్లించాల్సిన అవసరం ఉందని సగటు సినీ ప్రేమికుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.