Nayantara And Vignesh Shivan : నయనతార ‘పెళ్ళి సినిమా’ లాభం 200 కోట్లు.!
NQ Staff - July 21, 2022 / 08:34 PM IST

Nayantara And Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకి బీభత్సమైన లాభాలంటే.. ఓ యాభై కోట్లు రావొచ్చేమో. అదీ అంత తేలికైన వ్యవహారం కాదు. ఆమెకు అంత రేంజ్ లేదు కూడా.! కానీ, ఓ మోస్తరు బడ్జెట్‌లో నయనతార ప్రధాన పాత్రలో సినిమా తీస్తే, పెట్టిన పెట్టుబడికి రెండింతలు.. అంటే ఓ ముప్ఫయ్ నుంచి నలభై కోట్లు రాబట్టే పరిస్థితి వుంటుంది.

Do know Profitable Nayantara Vignesh Shivan Marriage
కానీ, నయనతార పెళ్ళి సినిమాకి లాభాలెంతో తెలుసా.? ఏకంగా రెండొందల కోట్లు. ఇంతకీ, ఈ పెళ్ళి కోసం ఎంత ఖర్చు చేసి వుంటారు.? ఏమో మరి.!
నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార పెళ్ళి సినిమా.!

Do know Profitable Nayantara Vignesh Shivan Marriage
పెళ్ళి.. అంటే జీవితాంతం ఓ జంట కలిసి జీవించేందుకు పడిన తొలి అడుగు. దాన్ని కూడా సినిమాగా మార్చేసింది నయనతార, విగ్నేష్ శివన్ జంట. చాలాకాలం పాటు సహజీవనం చేసి, తమ పెళ్ళి అనే సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుని, మంచి రేటుకి.. సినిమా హక్కుల్ని అమ్మేసుకుందన్నమాట విక్కీ నయన్ జోడీ.!
సరే, ఈ ప్రచారంలో నిజమెంత.? అన్నది పక్కన పెడితే, పరిస్థితులు నిజమేనేమో.. అనిపిస్తున్నాయ్. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ నయన – విక్కీలకు సంబంధించిన అన్ సీన్ ఫొటోల్ని విడుదల చేయడంతోపాటు, త్వరలోనే ఆ పెళ్ళి డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నట్లు పేర్కొంది.
కాన్సెప్ట్ అదిరింది కదూ.! పెళ్ళంటే మామూలుగా వుండకూడదు మరి.! ఆ పెళ్ళిని కూడా వ్యాపారంగా మార్చెయ్యాలి మరి.!