Divyansha Kaushik : ఐ లవ్ నాగచైతన్య.. దివ్యాంక కౌశిక్ క్లారిటీ.. సమంతకు భారీ షాక్..!
NQ Staff - January 29, 2023 / 10:15 AM IST

Divyansha Kaushik : సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య తన సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే ఆయనపై ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఆ అమ్మాయితో లవ్ లో ఉన్నాడని, వైజాగ్ అమ్మాయిని పెండ్లి చేసుకోబోతున్నాడంటూ ఇలా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. కాగా మొన్నటి దాకా ఆయన శోభిత ధూలిపాళ్ల హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.
వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంక కౌశిక్ తో కూడా ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి బయట కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెండ్లి చేసుకుంటారని చాలా రకాల వార్తలు వచ్చాయి.
తాజా ఇంటర్వ్యూలో..
అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ తనకు సంబంధం లేకపోయినా తనపై ఏదో ఒక న్యూస్ వినిపిస్తోందంటూ చెప్పింది. నాగచైతన్యతో లవ్ అనే రూమర్ అనగానే నేను చాలా షాక్ అయ్యాను. ఆయన చాలా అందంగా ఉంటాడు. ఐలవ్ హిమ్.
ఆయనపై నాకు క్రష్ ఉంది. కానీ ప్రేమ రూమర్లు మాత్రం అవాస్తవం. ఆయన చాలా మంచి వ్యక్తి. సెట్స్ లో ఆయన అందరినీ బాగా చూసుకుంటాడు. ఆయన సెట్స్ లోకి వస్తే నేను కుర్చీలో నుంచి లేచి నిల్చుంటాను. ఆయన వచ్చి ఇడియట్ కూర్చో అంటూ ప్రేమగా అంటాడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటూ చెప్పింది ఆమె.