Disha Patani : హాట్ అండ్ వైల్డ్ దిశా పటానీ.! ట్రెడిషనల్ సొగసుల జాతర.!
NQ Staff - August 25, 2022 / 09:04 AM IST

Disha Patani : ‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీకి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో సెషన్లతో కుర్రకారును ఇంప్రెస్ చేస్తుంటుంది దిశా పటానీ. తాజాగా దిశా పటానీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

Disha Patani new cute photos
స్కిన్ కలర్ గగ్రా చోళీలో దిశా పటానీ అందాలు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా కంటే, బ్రాండ్ బ్యూటీగా బాగా పేరు తెచ్చుకుంది.
దిశా పటానీ సొగసుల తళుకులు..
ప్రధానంగా ఇన్నర్ వేర్ బ్రాండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటూ, సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. తెలుగులో ‘లోఫర్’ తర్వాత కనిపించలేదు కానీ, బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది అందాల దిశా పటానీ.

Disha Patani new cute photos
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడే టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ సరసన ‘ప్రాజెక్ట్ కె’ లో నటిస్తోంది దిశా పటానీ. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం హైద్రాబాద్ వచ్చి వెళ్లిన దిశా పటానీ, హైద్రాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
మరిన్ని మంచి తెలుగు సినిమాల్లో నటించాలని వుందని చెప్పింది. సినిమాలతో పాటూ, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించిన దిశా పటానీ, ‘బాఘీ 3’ లో స్పెషల్ సాంగ్‌లోనూ మెరిసి మురిపించిన సంగతి తెలిసిందే.

Disha Patani new cute photos