Surender Reddy : కాలికి గాయం.. వీల్ చైర్ లో కూర్చుని ‘ఏజెంట్’ ను డైరెక్ట్ చేసిన సూరి
NQ Staff - January 7, 2023 / 11:16 PM IST

Surender Reddy : దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయం లో గాయపడ్డాడు. సాధారణంగా హీరో హీరోయిన్ లేదా ఇతర నటీనటులు షూటింగ్ సందర్భంగా గాయపడటం చూస్తూ ఉంటాం, కానీ దర్శకుడు ఒక సన్నివేశం వివరిస్తున్న సందర్భంగా పొర పాటున ప్రమాదానికి గురైయ్యాడట.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయం అవ్వడం తో హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుండి తిరిగి షూటింగ్ సెట్ కి వచ్చారట.
ఆ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు ఫోటో షేర్ చేసి దృవీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఆయన కాలికైన గాయం తోనే షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దర్శకుడు సూరి ఏజెంట్ సినిమా ను అతి త్వరలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు, అందులో భాగంగానే కాలికి గాయం అయినా కూడా షూటింగ్ స్పాట్ కు వచ్చి తన పని తాను చేసుకున్నాడు.
అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాలున్న ఏజెంట్ సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా దర్శకుడు సురేందర్ రెడ్డి కి ప్రమాదం జరిగి కాలికి గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆయన కాలు పర్వాలేదని పది నుండి పదిహేను రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలియజేశారట.