Lokesh Kanagaraj : బాబూ లోకేషూ.! ఎంతమంది హీరోల్ని శాటిస్‌ఫై చేయగలవ్.?

NQ Staff - June 16, 2022 / 10:21 PM IST

Lokesh Kanagaraj : బాబూ లోకేషూ.! ఎంతమంది హీరోల్ని శాటిస్‌ఫై చేయగలవ్.?

Lokesh Kanagaraj : ఎక్కడ చూసినా లోకేష్ నామ జపమే.! ఈ లోకేష్ మన రాజకీయ నాయకుడు నారా లోకేష్ కాదు. ఈయన లోకేష్ కనగరాజ్. ‘విక్రమ్’ సినిమా దర్శకుడు. దేశమంతా ఇప్పుడు ఈ లోకేష్ గురించే మాట్లాడుకుంటోందంటే, ఆయన తెరకెక్కించిన సినిమాలు అలాంటివి మరి.

director Lokesh Kanagaraj talk of the industry

director Lokesh Kanagaraj talk of the industry

కార్తీ హీరోగా ‘ఖైదీ’ సినిమా తెరకెక్కించిన లోకేష్, కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమాతో లేటెస్ట్ సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ‘విక్రమ్’ సినిమా సంచలనాలు సృష్టించేస్తోంది వసూళ్ళ పరంగా. కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిలిం ఈ ‘విక్రమ్’.

సక్సెస్సు వేరు.. ప్రభంజనం వేరు.!

ఓ సినిమా సక్సెస్ అవడం వేరు.. అది ప్రభంజనమవడం వేరు. ‘విక్రమ్’ సినిమా సక్సెస్ సాధించడమే కాదు, అంతకు మించిన ప్రభంజనాన్ని మనం చూస్తున్నాం. కమల్ హాసన్ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ప్రభంజనాన్ని మనం చూడలేదా.? అంటే, అది గతం.. ఇది ప్రస్తుతం.

దాదాపు దశాబ్దకాలం తర్వాత కమల్ నుంచి ఇంతటి సంచలనం వచ్చింది మరి. అందుకే, లోకేష్ కనగరాజ్ మీద కనక వర్షం కురిపించైనా, తెలుగులో ఆయనతో సినిమాలు చేయించాలని హీరోలు పోటీ పడుతున్నారు. అల్లు అర్జున్, ఎన్టీయార్ పేర్లు మాత్రమే ఇప్పటిదాకా వినిపించాయ్. తాజాగా రామ్ చరణ్ కూడా, లోకేష్ కోసం ప్రయత్నిస్తున్నాడట. ఇద్దరి మధ్యా ఇప్పటికే చర్చలు జరిగాయంటున్నారు.
వీళ్ళేనా.? ఇంకెవరైనా వున్నారా.? చూస్తోంటే, లోకేష్‌ని టాలీవుడ్ డైరెక్టర్‌గా మన టాలీవుడ్ హీరోలు మార్చేసేలా వున్నారనిపిస్తోంది కదూ.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us