Director Bobby : మీకు రాజకీయాలు కరెక్ట్ కాదు.. పవన్ సమాధానం చెబుతాడు
NQ Staff - January 8, 2023 / 10:24 PM IST

Director Bobby : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వైజాగ్ లో భారీ ఎత్తున జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాబీ మాట్లాడుతూ… అన్నయ్య మీకు రాజకీయాలు కరెక్ట్ కాదు, దేవుడు మీకు ఒక తమ్ముని ఇచ్చారు. ఆయన చూసుకుంటాడు.. ఆయన సమాధానం చెబుతాడు.. ఆయనే గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం మంచితనం కలిస్తే పవన్ కళ్యాణ్. మాటకి మాట, కత్తికి కత్తి అన్నట్లుగా ఉంటారు.
రాజకీయాల్లో ఎదురు దాడి చేయరు ఎందుకని నేను చిరంజీవిని అడిగితే వాళ్ళకి అమ్మా నాన్నలు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళు బాధపడతారని చాలా సౌమ్యంగా ఒకానొక సమయంలో చిరంజీవి గారు నాతో చెప్పారు అంటూ దర్శకుడు బాబి పేర్కొన్నారు.
ఇంకా బాబీ.. ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి రవితేజ కారణం, ఆయన నాకు అవకాశం ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో నిలబడ్డాను. చిరంజీవి గారి అభిమానిగా నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్లకి చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది.
చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.