Ram Pothineni And Anudeep : అనుదీప్: రామ్ కోసం ‘వెయిటింగ్’ అంటోన్న ‘ప్రిన్స్’ డైరెక్టర్.!
NQ Staff - November 4, 2022 / 09:33 PM IST

Ram Pothineni And Anudeep : యంగ్ డైరెక్టర్ అనుదీప్.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ‘జాతిరత్నాలు’ వంటి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట ఈ సినిమా పేరు పలు మార్లు వచ్చిందంటేనే.. మెగాస్టార్‌ని సైతం ఈ డైరెక్టర్ ఎంతలా ఇంప్రెస్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు.
లేటెస్ట్‌గా ‘ప్రిన్స్’ సినిమాతో ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేశాడీ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. తొలి సినిమా ఏదో అలా ఫ్లోలో కొట్టుకెళ్లపోయింది. కానీ, రెండో సినిమా ఆశించిన రేంజ్ హిట్ దక్కించుకోలేక పోయింది.
రామ్ ఓకే అంటే ప్రాజెక్ట్ సెట్ అయిపోయినట్లే.!
పట్టడం తమిళ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన శివ కార్తికేయన్‌ని బాగానే పట్టేశాడు కానీ, హిట్ కొట్టడంలో మాత్రం ఒకింత రేస్‌లో వెనకబడ్డాడు. అయినా కానీ, మనోడి బ్రాండ్ నేమ్ ఏమాత్రం పడిపోలేదండోయ్.
అప్పటికే ముగ్గురు ప్రముఖ నిర్మాణ కంపెనీలతో డీల్ సెట్ చేసుకున్నాడీ కామెడీ డైరెక్టర్. ప్రొడక్షన్ హౌసెస్ రెడీ, హీరో దొరికితే, వెంటనే సినిమా తెరకెక్కించేయడమే తరువాయి. అంత స్పీడు మీదున్నాడు మనోడు.
కానీ, తన తదుపరి చిత్రం రామ్ పోతినేనితో తెరకెక్కించాలని వుందని అనుదీప్ తన మనసులోని మాట బయటపెట్టాడు. రామ్ కోసం ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనింగ్ స్టోరీ తన వద్ద వుందనీ చెబుతున్నాడు. కానీ, రామ్ ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా వున్నాడు.
ఒకవేళ అనుదీప్ ప్రాజెక్ట్‌కి రామ్ ఓకే చెప్పినా బోయపాటి సినిమా పూర్తి చేసి కానీ, ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయలేడు. ఏమో మనోడి లక్ బాగుంటే, ఓకే చెప్పినా చెప్పేస్తాడు రామ్. రేపో మాపో సినిమా పట్టాలెక్కించేసినా ఎక్కించేస్తాడు.