Dimple Hayathi Tweet Tagging KTR : కేటీఆర్‌.. మాకు పెట్రోల్ ఫ్రీగా రావట్లేదు.. డింపుల్ హయతీ సంచలన ట్వీట్..!

NQ Staff - July 20, 2023 / 10:33 AM IST

Dimple Hayathi Tweet Tagging KTR : కేటీఆర్‌.. మాకు పెట్రోల్ ఫ్రీగా రావట్లేదు.. డింపుల్ హయతీ సంచలన ట్వీట్..!

Dimple Hayathi Tweet Tagging KTR :

డింపుల్ హయతీ ఈ నడుమ చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న పనులు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. తాజాగా కేటీఆర్‌ ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆమె ట్విట్టర్ వేదికగా ఇలా రాసుకొచ్చింది. హైదరాబాద్ లో ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతోంది. ఎమర్జెన్సీ అయితే అసలు ఇంటికి వెళ్లగలమా.

ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ.. ప్రజా ప్రతినిధులారా మాకు పెట్రోల్ ఫ్రీగా రావట్లేదు అంటూ మంత్రి కేటీఆర్‌ ను, సీఎంవో అకౌంట్స్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సెన్సేషన్ అయిపోయింది. డింపుల్ హయతీ డేరింగ్ కు అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆమె ఈ ట్వీట్ చేయడం వెనక అసలు కారణం వేరే ఉంది.

ఆ గొడవనే కారణం..

Dimple Hayathi Tweet Tagging KTR

Dimple Hayathi Tweet Tagging KTR

కొన్ని రోజుల క్రితం ఆమెకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు గొడవ జరగింది. తన కారు డ్రైవర్ ను తిట్టారంటూ డింపుల్ హయతీ మీద ఆమె ప్రియుడి మీద రాహుల్ హెగ్డే కేసు నమోదు చేశారు. దాంతో అప్పటి నుంచి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ అంటేనే డింపుల్ హయతీ రగిలిపోతోంది.

అందుకే ఆయనకు కౌంటర్ వేసే ఉద్దేశంతో ఇలాంటి ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ మీద కేటీఆర్‌, ఇతర అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షాల కారణంగా ట్రాఫిక్ బాగా జామ్ అవుతోంది. ఇదే విషయాన్ని ఆమె తనకు అనుకూలంగా వాడుకుందన్నమాట.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us