Dil Raju : నేనే ముందు.! ‘వారిసు’పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.!
NQ Staff - November 28, 2022 / 12:51 PM IST

Dil Raju : 2023 సంక్రాంతికి సంబంధించి మొట్టమొదట రిలీజ్ ప్రకటించింది తానేనంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తానని ముందుగా చెప్పింది తానేననీ, ఆ తర్వాతే ఇతర సినిమాలు సంక్రాంతి డేట్‌ని కన్ఫామ్ చేసుకున్నాయని దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
‘వారిసు’ నిజానికి తమిళ సినిమా. తెలుగు, హిందీ భాషల్లోకి డబ్ అవుతోందంతే. ఏకకాలంలో మూడు భాషల్లోనూ ‘వారిసు’ విడుదలవుతుంది. తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తారు. విజయ్ సరసన రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకుడు.
సంక్రాంతి తెలుగు హీరోల సంగతేంటి.?
ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి.. ఇంకొకరేమో నందమూరి బాలకృష్ణ. సీనియర్ అగ్రహీరోలు ఈ ఇద్దరూ. సంక్రాంతికి బాలయ్య సినిమాలు చేసే మ్యాజిక్ వేరే లెవల్లో వుంటుంది. పైగా, ‘అఖండ’ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా ‘వీర సింహా రెడ్డి’.
ఇక, చిరంజీవి సంగతి సరే సరి. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న చిరంజీవి పక్కా మాస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి సందడి చయబోతున్నారు. మామూలుగా అయితే ఓ తెలుగు నిర్మాతగా, తెలుగు సినిమాకి ఊతమిచ్చేలా.. దిల్ రాజు వ్యవహరించాలి.
‘వారిసు’ సినిమాని ఆపెయ్యమని కాదు, తెలుగు సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించడానికి సహకరించాలి. కానీ, దిల్ రాజు ఆలోచనలు వేరేగా వున్నాయ్. అదే అసలు సమస్య. ‘నేనే ముందు’ అని చెప్పడం ద్వారా దిల్ రాజు కొత్త పంచాయితీకి తెరలేపారు.