Dil Raju : టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలని బతికిస్తుంది ఆ దిల్లున్న మారాజేనా?

NQ Staff - September 26, 2022 / 04:23 PM IST

Dil Raju : టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలని బతికిస్తుంది ఆ దిల్లున్న మారాజేనా?

Dil Raju : కథ, కంటెంట్ బాగుంటే భాషా బేధాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల్ని సినిమాల్ని ఆదరిస్తారనేది అన్ని ఇండస్ట్రీ వాళ్లు చెప్పే మాటే. నిజానికి కొన్ని సినిమాలు ఒరిజినల్ లాంగ్వేజ్‌ లో కన్నా ఇక్కడ డబ్ అయ్యే ఎక్కువ బంపర్ హిట్ సాధించినవి కూడా లేకపోలేదు. ఆ విషయంలో మన అభిరుచిని, మంచితనాన్ని పక్కనబెడితే.. ఓ రకంగా తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్‌ లో సక్సెసవడానికి ప్రధాన కారణం దిల్ రాజేనన్న టాపిక్‌ లేటెస్ట్ గా మరోసారి తెరపైకొచ్చింది.

ప్యాండెమిక్ రోజుల్ని మినహాయించుకుంటే దసరా బాక్సాఫీస్‌ సందడి మామూలుగా ఉండేది కాదు. కరోనా పీడ విరగడైపోయింది కాబట్టి ఈసారి పండక్కి థియేటర్ల దగ్గర బడా స్టార్ల వార్, పెద్ద సినిమాల పోటీ మామూలుగా ఉండదు అని అనుకున్నారు మూవీ లవర్స్‌ అండ్ సెలబ్రిటీ హీరోల హార్డ్ కోర్ ఫ్యాన్స్‌. కానీ రియాలిటీలో మాత్రం అలా జరగట్లేదు.

పోనీ విడుదలకసలు సినిమాలే లేవా అంటే అదీ కాదు. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగ్ ‘ది ఘోస్ట్’ లాంటి లక్షలాది ఫ్యాన్స్‌ ఉన్న బడా స్టార్ల సినిమాలు రెడీగా ఉన్నాయి. అలాంటి భారీ హైప్ ఉన్న సినిమాలను కూడా ఒకటిరెండు రోజుల ముందయినా కాకుండా సరిగ్గా పండగరోజే రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 వరకూ హాలీడేస్ ప్రకటించారు.

ఇలాంటి టైమ్‌ లో పెద్ద సినిమాలు పడుంటే ఆ రచ్చ, సందడి ఏ రేంజ్‌ లో ఉండేదసలు? అన్‌ సీజన్లో, అసలు జనాలు థియేటర్‌ వైపు కూడా చూడడానికి గ్యాప్‌ లేని టైమ్‌లో డజన్ల కొద్ది సినిమాలను వదులు తుంటారు. దసరా పోటీ మాత్రం ఒక్కరోజు ముందు నుంచి కూడా లేకపోవడమేంటో? పైగా ఈ వారంమంతా థియేటర్స్‌ని నేనే వస్తున్నా, పొన్నియిన్ సెల్వన్ లాంటి డబ్బింగ్ సినిమాలకిచ్చేశారు.

అన్నిటికంటే దారుణమైన మరో మ్యాటరేంటంటే.. ఫ్యాన్స్‌ అందరూ హడావిడి చేసే ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సుదర్శన్ 35 MM థియేటర్లో తెలుగు సినిమానే లేదీ దసరాకి. రెండు పెద్ద హీరోల సినిమాలతో పాటు, జిన్నా, స్వాతిముత్యం అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలున్నా ఆ టాకీసుని కోలీవుడ్‌ డబ్బింగ్ మూవీ పొన్నియిన్ సెల్వన్ కోసం బ్లాక్ చేశాడు దిల్ రాజు. ఇప్పటికే హైదరాబాద్‌ మల్టీప్లెక్సుల్లో ఆ మూవీ టికెట్ ధరను అమాంతం పెంచేసి రూ. 295 కి అమ్ముతున్నారు.

తెలుగు సినిమాలకి కూడా అంత రేట్ పెట్టడానికి వెనకాముందవుతున్న టైమ్‌ లో ఓ అరవ మూవీకి అంతలా పెంచేస్తారా? అంటూ మన సోకాల్డ్‌ హార్ట్ కింగ్ పై హార్ష్‌ గానే రియాక్టవుతున్నారు ఆడియెన్స్‌. అది చాలనట్టు ఇప్పుడిలా మన టాలీవుడ్‌ సినిమాలకు కాకుండా అలాంటి చిత్రాలకి థియేటర్లను కంప్లీట్ గా బ్లాక్ చేయడంతో సదరు ప్రొడ్యూసర్ కమ్‌ డిస్ట్రిబ్యూటర్ లపై కామెంట్లు, కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి.

ఆ మధ్య యాక్టివ్ ప్రొడ్యూసర్ల స్ట్రయికంటూ సినిమా షూటింగుల్ని అందరూ ఆపేసినా, వంశీపైడిపల్లి డైరెక్షన్లో వస్తోన్న వారిసు(వారసుడు) అనే బైలింగ్వల్ మూవీ షూటింగ్ వైజాగులో సాఫీగా సాగింది. అదేంటి? అనడిగితే అది కోలీవుడ్‌ మూవీ అంటూ చక్కటి కవర్ డ్రైవ్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఆయనపై నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకాస్త పెరిగింది. ఆయన సినిమాలకయితే ఒక రూల్‌, అవతలి సినిమాలకయితే ఒక రూలా? ఎంత డిస్ట్రిబ్యూటర్ గా, బడా నిర్మాతగా చక్రం తిప్పే స్టేజ్‌ లో ఉంటే మాత్రం తెలుగు సినిమాకు ప్రయారిటీ ఇవ్వకుండా
తమిళ చిత్రాలకి, అక్కడి డబ్బింగ్ మూవీలకి థియేటర్లు అంకితం చేయడం ఎంతవరకు కరెక్టంటూ కొశ్చన్ చేస్తున్నారు ప్రేక్షకులు.
మరి ఈ రేంజ్‌ రెస్పాన్స్‌ చూశాక ఆయన రియాక్షన్, ప్లాన్ ఆఫ్‌ యాక్షన్ లో అయినా ఏమయినా మార్పొస్తుందేమో చూడాలిక.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us