Dil Raju : నిజం ఒప్పేసుకున్న నిర్మాత దిల్ రాజు.!

NQ Staff - August 1, 2022 / 07:03 PM IST

148248Dil Raju  : నిజం ఒప్పేసుకున్న నిర్మాత దిల్ రాజు.!

Dil Raju  : తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు బంద్.. ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, కొన్ని సినిమాల షూటింగులు జరుగుతున్నాయంటూ సినీ పరిశ్రమలో అలజడి బయల్దేరింది. ఈ క్రమంలో ఏయే సినిమాల షూటింగులు జరుగుతున్నాయన్నదానిపై మీడియా ఆరా తీసింది.

ప్రముఖ తమిళనటుడు విజయ్, చెన్నయ్ నుంచి విశాఖపట్నం వచ్చాడు తన తాజా సినిమా ‘వారిసు’ షూటింగ్ కోసం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం విదితమే. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు రూటే సెపరేటు.!

Dil Raju Changed word About Shooting Bandhu

Dil Raju Changed word About Shooting Bandhu

తమిళ హీరో నటిస్తోన్న తొలి తెలుగు సినిమా.. అంటూ ‘వారిసు’ గురించి దిల్ రాజు గతంలో చెప్పుకొచ్చారు. తెలుగులో ఈ సినిమాకి ‘వారసుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు కూడా. ద్విభాషా చిత్రం అంటే.. తెలుగు సినిమా కూడా కదా.?

నిజానికి, దిల్ రాజు ప్రతి విషయంలోనూ డబుల్ టంగ్‌తో వ్యవహరిస్తారన్న విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – ఏపీ సర్కారు మధ్య రాజకీయ రచ్చ నడుస్తున్న సమయంలో, ఏపీ ప్రభుత్వ పెద్దలతో భేటీ అవడం, ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ మీద దిల్ రాజు సమక్షంలోనే విమర్శలు చేయడం తెలిసిన విషయం మే. ఆ వెంటనే ఆయన హైద్రాబాద్ వచ్చి, పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
ఇప్పుడేమో, తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు బంద్.. అని దిల్ రాజు ప్రకటించి, తన సినిమాని తమిళ సినిమాగా పేర్కొంటూ ‘వారిసు’.. అదేనండీ ‘వారసుడు’ సినిమాకి మాత్రం షూటింగుల బంద్ నుంచి మినహాయింపు ఇచ్చుకున్నారన్నమాట.