Ram Charan : సుకుమార్ సలహాతో రామ్ చరణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా?
NQ Staff - November 23, 2022 / 10:01 AM IST

Ram Charan : ఉప్పెన సినిమా తో దర్శకుడిగా సక్సెస్ అయిన బుచ్చిబాబు తదుపరి సినిమా విషయం లో మల్లగుల్లాలు పడుతున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించిన కూడా అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ఎన్టీఆర్ కథ కి ఓకే చెప్పినా కూడా ఆయన వద్ద డేట్లు ప్రస్తుతానికి లేక పోవడంతో మరో హీరో ని వెతుక్కోవాల్సి వచ్చింది. బుచ్చిబాబు వద్ద ఉన్న ఒక కథ రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందనే ఉద్దేశం తో స్వయంగా సుకుమార్ రిఫర్ చేశాడట.
బుచ్చిబాబు చెప్పిన కథ ఒక సారి వినమంటూ రామ్ చరణ్ కి సుకుమార్ చెప్పడం.. ఆ సమయం లో రామ్ చరణ్ ఆ కథ ను వినడం.. వెంటనే ఓకే చెప్పడం జరిగిందట. స్క్రిప్ట్ వరకు కూడా దాదాపు పూర్తి అయింది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న రామ్ చరణ్ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నుండి బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు గాను ఓకే చెప్పాడని తెలుస్తోంది. అతి త్వరలోనే బుచ్చిబాబు మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతుంది.
రాంచరణ్ తో సినిమా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కన్ఫమ్ అవ్వడానికి కారణం సుకుమార్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది.