Prabhas : ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ‘బాహుబలి’ సెంటిమెంటుని నమ్ముకున్నాడా.?

NQ Staff - October 1, 2022 / 10:53 PM IST

Prabhas : ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ‘బాహుబలి’ సెంటిమెంటుని నమ్ముకున్నాడా.?

Prabhas : తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయితే, మన హీరోలు నేరుగా హిందీలో డబ్బింగ్ చెప్పడం చాలా అరుదు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ‘బాహుబలి’ కోసం వేరే నటుడితో డబ్బింగ్ చెప్పారు ప్రభాస్ పాత్రకి. కానీ, ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలకి ప్రభాస్ సొంతంగా హిందీలోనూ డబ్బింగ్ చెప్పాడు.

కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నాడట ప్రభాస్ తన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ కోసం. ఓం రౌత్ రూపొందిస్తోన్న ‘ఆదిపురుష్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అప్పుడు ‘బాహుబలి’ కోసం.. ఇప్పుడు ‘ఆదిపురుష్’ కోసం.!

శరద్ కేల్కర్.. ఈ పేరు ఎప్పుడో విన్నట్లుంది కదా.? ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గుర్తుంది కదా.? పవన్ కళ్యాణ్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో శరద్ కేల్కర్ విలన్‌గా నటించాడు. ఆ శరద్ కేల్కర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.

‘బాహుబలి’కి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పాడు.. ప్రభాస్ పాత్ర కోసం. ఇప్పుడు మళ్ళీ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్‌నే డబ్బింగ్ కోసం రంగంలోకి దించారట. ‘బాహుబలి’ సెంటిమెంట్ అనుకోవాలా.? అంటే, ఔననే చెప్పాలేమో.!

అన్నట్టు, శరద్ పలు హాలీవుడ్ సినిమాల హిందీ వెర్షన్లకూ డబ్బింగ్ చెప్పాడండోయ్.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us