Dhanush : అర్ధాంత‌రంగా ఆగిన ధనుష్ సార్ మూవీ షూటింగ్.. కార‌ణం ఏంటో తెలుసా..!

Dhanush : త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ ఇప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై కూడా దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. తెలుగులో ఏకంగా ఇద్దరు దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో శేఖర్ కమ్ముల సినిమా ఒకటి.. మరొకటి వెంకీ అట్లూరి సినిమా. ఈ రెండు సినిమాల్లో ముందుగా వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు ధనుష్.

Dhanush and Venky Atluri movie Sir shooting stooped
Dhanush and Venky Atluri movie Sir shooting stooped

రీసెంట్ గా రంగ్ దే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ.. ఇప్పుడు ధనుష్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేసి రంగంలోకి దిగుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజకార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ధనుష్ పీలుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్ మొఖం కనిపించకుండా వెనక్కి తిరిగి ఉన్న ఫోటోను విడుదల చేశారు.

ఈ లుక్ లో ధనుష్ ఫార్మల్స్ ధరించి సింపుల్ గా కనిపిస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ను కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక వెంకీ తన సినిమాల్లో అందమైన ప్రేమ కథను కూడా చూపిస్తుంటాడు.. దాంతో ధనుష్ సార్ సినిమాలోనూ ఒక ఎమోషన్ తో కూడిన లవ్ స్టోరిని చూపిస్తాడని అంటున్నారు.

సార్ సినిమా రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్.. ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఒక్క రోజు బాగానే షూటింగ్ జరిగింది. కాని హీరో ధనుష్ వద్దన్న కారణంగా ఈ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. కరోనా భయంకరంగా విరుచుకుపడుతుండటంతో షూటింగ్ ను ఆపేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా సత్యరాజ్ కు సీరియస్ కూడా అయ్యింది. మహేష్,తమన్ లాంటి వారినే కరోనా వదిలిపెట్టలేదు. దాంతో ఇండస్ట్రీలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రెగ్యూలర్ షూటింగ్ చేయడం మంచిది కాదు అని నిర్ణయింకున్నారట హీరో ధనుష్. అందుకే పరిస్థితి చక్కబడే వరకూ..షూటింగ్ పోస్ట్ పోన్ చేశారని సమాచారం.

ఇప్పటి వరకూ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు ధనుష్ . ఇక్కడి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలను తలదన్ని భారీ బడ్టెట్ తో సినిమాలు చేస్తుంది.