Deepthi Sunaina : స‌మ‌యం ఎప్పుడు ఒకేలా ఉండ‌దు అంటూ దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Deepthi Sunaina : కొత్త ఏడాది సినీ ల‌వ‌ర్స్‌కి పెద్ద షాక్ ఇచ్చిన అంశం ఏది అంటే అది దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ బ్రేక‌ప్. సుదీర్ఘ కాలంగా లవ్ ట్రాకును నడిపిన వీళ్లిద్దరూ కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కుతారు అంటూ ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ మొత్తం మార్చేసింది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరుతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పక తప్పలేదు.

Deepthi Sunaina about breakup
Deepthi Sunaina about breakup

ఇప్పటిదాకా కలిసి సాగించిన ప్రయాణానికి స్వస్తి పలుకుతూ ఇకపై విడివిడిగా ఉంటామని వెల్లడించారు. వీరి బ్రేకప్‌ వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జంట విడిపోయి వారానికి పైనే అవుతున్నా ఫ్యాన్స్‌ మాత్రం మళ్లీ కలుస్తే బాగుండు అంటూ సోషల్‌ మీడియాలో ఆశతో ఎదురుచూస్తున్నారు.

Deepthi Sunaina about breakup
Deepthi Sunaina about breakup

ఇలాంటి సమయంలో షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్‌ సాంగ్‌ ‘మలుపు’ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను ఎంతలా ఎంజాయ్‌ చేశారో, పాట కోసం ఎలా కష్టపడ్డారో చూపించారు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ ‘నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్‌ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది’ అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది.

ఆ తర్వాత షణ్ను ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. ‘మీ జంట చూడముచ్చటగా ఉంది, వీడియో చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి’, ‘మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్‌ ఇదే అవుతుందనుకోలేదు’, ‘ఎంతో ఆప్యాయంగా ఉండే మీరు మళ్లీ కలవాలి’ అని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

మేకింగ్ వీడియో విడుద‌లైన త‌ర్వాత దీప్తి సున‌య‌న సోషల్ మీడియా వేదిక గా ఈరోజు ఒక ఎమోషనల్ పోస్ట్ ను చేయడం జరిగింది. ఆ పోస్ట్ లో తన ఫోటో తో పాటుగా సమయం గురించి కొన్ని లైన్స్ ను షేర్ చేయడం జరిగింది. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, జీవితంలో ఒక నిర్దిష్ట క్షణంలో ఆగిపోదని చెప్పింది. తర్వాత ఏం జరుగుతుందో కూడా బయటపెట్టదు అంటూ చెప్పుకొచ్చారు.

తన పోస్ట్‌లో సమయాన్ని ప్రస్తావిస్తూ, పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పింది. దీప్తి యొక్క భావోద్వేగ పోస్ట్ ఆమె ఫాలోవర్స్ ను మరియు శ్రేయోభిలాషుల నుండి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.