Deepika Padukone : పెళ్లికి ముందే శారీరకంగా కలిశాం.. అందుకే బాండింగ్ పెరిగిందిః దీపికా పదుకొణె

NQ Staff - June 8, 2023 / 01:30 PM IST

Deepika Padukone : పెళ్లికి ముందే శారీరకంగా కలిశాం.. అందుకే బాండింగ్ పెరిగిందిః దీపికా పదుకొణె

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అంటే తెలియని వారు ఉండదు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను కూడా ఊపేస్తోంది. ఒకప్పుడు నల్లగా ఉందంటూ విమర్శలు ఎదుర్కున్న స్థాయి నుంచి హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పెండ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాలను ఆపట్లేదు.

ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ భామ. అయితే ఈ నడుమ వరుసగా హాలీవుడ్ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఆమె లండన్ లో ఓ టీవీ షోకు హాజరయింది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇందులో ఆమెకు కొన్ని ప్రశ్నలు వేశారు అక్కడున్న వారు.

మీరు పెండ్లికి ముందే డేటింగ్ చేయడాన్ని ఎలా చూస్తారు అని అడగ్గా.. ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇది ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. అందుకే దాన్ని తప్పు బట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే పెండ్లికి ముందే శారీరకంగా కలుసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలు ఉండవు.

మంచి బాండింగ్ ఏర్పడుతోంది. నేను కూడా దాన్ని ఫాలో అయ్యాను. అందుకే నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను. ఒకరి ఇష్టాలను ఇంకొకరు గౌరవించుకుంటాం. ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే అది కచ్చితంగా అవసరం.

ఇదంతా కేవలం కలిసి జీవించడం వల్లే సాధ్యం అవుతుందని నా నమ్మకం అంటూ తెలిపింది దీపికా. కానీ దీపికా పదుకొణె చేసిన కామెంట్లపై కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇండియన్ కల్చర్ ను నాశనం చేస్తున్నావంటూ ఆడేసుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us