Mahesh Babu : మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన డాన్సర్లు : ‘సూపర్’ ఛాన్స్ కొట్టేశారుగా.!
NQ Staff - August 30, 2022 / 09:37 PM IST

Mahesh Babu : బుల్లితెరపై ‘డాన్స్ ఇండియన్ డాన్స్’ అనే ఓ డాన్స్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ షోకి తన ముద్దుల తనయ సితారతో కలిసి అటెండ్ అయ్యారు మహేష్ బాబు.

Dancers who impressed Mahesh Babu in Zee telugu show
ఈ షోలో బాబు, మరియు కుమార్ అనే ఇద్దరు కంటెస్టెంట్లు చేసిన పర్ఫామెన్స్ మహేష్ బాబుని చాలా ఇంప్రెస్ చేసింది. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్‌గా అభివర్ణించారు ఆ కంటెస్టెంట్స్ డాన్స్ ఫర్ఫామెన్స్‌ని మహేష్ బాబు.
అంతేకాదు, తన సినిమాలో ఛాన్సిస్తానని మాటిచ్చేశారు కూడా. తాను చేసే సినిమా కానీ, తీసే సినిమాలో కానీ ఏదో ఒక ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాను.. అంటూ సదరు డాన్సర్లకు హామీ ఇచ్చారు మహేష్ బాబు.
మహేష్ మాటిస్తే ఇక అంతే.!
అంతలా ఆ డాన్సర్లు తమ టాలెంట్‌తో మహేష్ బాబుని ఇంప్రెస్ చేశారన్న మాట. మహేష్ మాటలకు ఆ డాన్సర్లు పట్టరాని సంతోషంతో కాళ్ల మీద పడి తమ అభిమాన హీరోకి అభివాదం తెలిపారు.
సహజంగా ఈ తరహా షోలకు చాలా తక్కువగా హాజరవుతుంటారు మహేష్ బాబు. అలాంటిది త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానున్న ‘డాన్స్ ఇండియన్ డాన్స్ తెలుగు’ అనే ఈ డాన్స్ ఐకాన్ షోకి సూపర్ స్టార్ రాకతో సరికొత్త కళ వచ్చిందనే చెప్పాలి.
మరోవైపు మహేష్ బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, కొన్ని రోజులు విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చారు. త్వరలోనే త్రివిక్రమ్‌తో మహేష్ బాబు చేయాల్సిన సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.