Daksha Nagarkar : ‘జాంబీ రెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్ పోషించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు దక్షా నగార్కర్. ఆ సినిమాలో చాలా మామూలుగా కనిపించిన ఈ అమ్మడి గ్లామర్ యాంగిల్ చూస్తే భయానకం, బీభత్సం.. అంతకు మించి పదాలేమైనా వుంటే దయా దాక్షిణ్యాలు లేకుండా ఈజీగా వాడి పడేయొచ్చు.

ఎందుకింతలా.. అంటారా.? అమ్మడి అందాల దాడి ఆ రేంజ్‌లో వుంటుంది మరి. తాజాగా దక్షా నగార్కర్ ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేసింది. క్లోజప్‌లో వుందేమో.. భయానకంగా అనిపించింది. భారీ అందాల్నిమరీ అంతలా కెమెరాకి దగ్గరగా చూపించేమాకు తల్లీ.. సంటోళ్లు జడుసుకుంటారు.. అంటూ కొందరు నెటిజన్లు దక్షా నగార్కర్‌ని స్వీట్‌గా ట్రోల్ చేస్తున్నారు.

అందాల ఆరబోతలో మరీ ఇంత బరితెగింపా.?
ఇంకొందరైతే, మరీ ఎంత అవకాశాలు రాకపోతే మాత్రం దక్కించుకునేందుకు ఇంతలా దిగ జారిపోతావా.? అంటూ కాస్త గుస్సాగా రెస్పాండ్ అవుతున్నారు. మరికొందరైతే, ఏంటి పాప ‘జాంబి రెడ్డి’ సినిమా చేశావనీ, మరీ గ్లామర్ జాంబీలా తయారైతే ఎలా.? ఇట్ట సేయమాకు మరీ బాగోదు.. అంటూ క్యూట్‌గానూ ట్రోల్ చేస్తున్నారు.
- Advertisement -

‘మరీ బరితెగింపు ఎక్కువైంది.. కాస్త తగ్గించు’ అంటూ మరో వర్గం నెటిజనం ఇంకాస్త మోటుగా రెస్పాండ్ అవుతున్నారు. ఏది ఏమైతేనేం, దక్షా నగార్కర్ అందాలకు ఇంత మంది రెస్పాన్స్ అయ్యారంటే, అంత బీభత్సం చేయబట్టే మరి.

ఇక, ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య ‘బంగార్రాజు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యంగ్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఛాన్సు దక్కించుకుందని సమాచారం.