Bigg Boss Sri Satya: బిగ్ బాస్ రచ్చ.! అప్డేట్ శ్రీ సత్య మీద ట్రోలింగ్ షురూ.!

NQ Staff - September 8, 2022 / 06:11 PM IST

157292Bigg Boss Sri Satya: బిగ్ బాస్ రచ్చ.! అప్డేట్   శ్రీ సత్య మీద ట్రోలింగ్ షురూ.!

Bigg Boss Sri Satya : పప్పు సుద్ద.. ముద్ద పప్పు.. కూర్చున్న చోట నుంచి కదలదు.. ఇలా బోల్డన్ని విమర్శలు శ్రీ సత్య మీద వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా.! బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో హాటెస్ట్ కంటెస్టెంట్ల లిస్టులో శ్రీసత్య పేరు ముందుంటుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేత బిందు మాధవికి అప్డేట్ వెర్షన్.. అంటూ శ్రీ సత్య గురించి ఓ వైపు పాజిటివ్ పబ్లిసిటీ నడుస్తోంటే, ఇంకో వైపు ఆమెకు వ్యతిరేకంగా విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. నిజానికి ఇంకా శ్రీ సత్య సరైన గేమ్ షురూ చేయలేదు.

బుల్లతెరపై మంచి ఫాలోయింగ్..

 Criticism Coming On Bigg Boss Sri Satya

Criticism Coming On Bigg Boss Sri Satya

పలు సీరియళ్ళలో నటించిన శ్రీ సత్యకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే వుంది. తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల్ని పెంచుకుంటోంది శ్రీ సత్య.

శ్రీసత్య అనూహ్యంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. షో మొదలై రోజులు గడుస్తున్నా, తన క్యూట్ అప్పీల్‌తో తప్ప, ఇంతవరకు తనదైన ముద్రని బలంగా వేయలేకపోయింది ఈ బ్యూటీ. ఆమె క్యూట్ అప్పీల్‌కి బిగ్ బాస్ లవర్స్ ఫిదా అవుతోంటే, కొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

శ్రీ సత్య ఆర్మీ అనీ, ఇంకోటనీ.. సోషల్ మీడియాలో అభిమానగణం కనిపిస్తోందంటే, పక్కా ప్లానింగ్‌తోనే బిగ్ హౌస్‌లోకి శ్రీ సత్య ఎంటర్ అయ్యిందన్నమాట.