30 Years Prudhvi : 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కి హైకోర్ట్ మొట్టికాయలు..విడాకులు ఇచ్చి వదిలేస్తే ఎలా నెలకి 8లక్షలు ఇవ్వాల్సిందే!!
NQ Staff - October 1, 2022 / 10:45 AM IST

30 Years Prudhvi : టాలీవుడ్ ప్రేక్షకులకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సుపరిచితుడుగా మారిన పృథ్వీ ప్రస్తుతం తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. హాయిగా కమెడియన్ గా సినిమాలు చేసుకోక ఏదో పొడి చేద్దాం అన్నట్లుగా రాజకీయాల్లోకి వెళ్లి వైకాపాలో జాయిన్ అయ్యాడు.
అక్కడ నానా కష్టాలు పడి..
జగన్ ను మచ్చిక చేసుకునేందుకు నోటికి వచ్చినట్లుగా ప్రత్యర్థులను తిట్టి చివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక పదవిని దక్కించుకున్నాడు. దాన్ని సరిగా నిలబెట్టుకోలేక పోయాడు.
పవిత్రమైన ప్రదేశంలో నీచమైన పనికి పాల్పడ్డాడు. దాంతో వెంటనే ఆ పదవి నుండి వైకాపా తన్ని తరిమేసిందనే చెప్పాలి. దాని నుండి ఇప్పటికి కూడా బయట పడలేక పోతున్న పృథ్వీ మళ్లీ మళ్లీ కష్టాలు పడుతూనే ఉన్నాడు.
దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఇప్పటికే వైకాపా తన్ని తరిమేసింది, తిరుమల తిరుపతి దేవస్థానం పదవి పోయింది. సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు, ఇలాంటి సమయంలో పృథ్వీ కి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
గత కొన్ని రోజులుగా పృథ్వీ మరియు అతని భార్య మధ్య కోర్టు వివాదం నడుస్తోంది. నా భర్త నెలకు 30 లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు, అతని నుండి నేను విడిపోవాలనుకుంటున్నాను కనుక ఈ సమయంలో నాకు నెలకు 8 లక్షల రూపాయలు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
ఆమె సాక్షాదారాలతో సహా అన్నింటిని సమర్పించడంతో కోర్టు ఆమెకు అనువుగా తీర్పు ఇచ్చింది. ప్రతి నెల 10వ తారీకు నాటికి ఎనిమిది లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వాలంటూ కోర్టు ఆర్డర్ వేసింది.
ఈ దెబ్బతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మరింతగా కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆఫర్లు లేక చిన్నాచితక సినిమాల్లో నటిస్తున్నాడు. చివరికి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లో కూడా కనిపించేందుకు ఓకే చెప్పుతున్న పృథ్వీ మరింతగా పరిస్థితి దిగజారే రోజులు ముందున్నాయి.
ఈ సమయంలో ఆయన భార్య మాజీ భార్యకి 8 లక్షల భరణం ఇవ్వాలంటే చాలా కష్టమే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బతో పృథ్వీ మళ్ళీ కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానమే.