Maharshi And Varasudu : మహేష్ ‘మహర్షి’ కాస్ట్యూమ్స్ విజయ్ ‘వారసుడు’ కోసం వాడేశారా.?
NQ Staff - October 26, 2022 / 01:34 PM IST

Maharshi And Varasudu : ఈ రోజుల్లో సినిమాలు తీసేముందు, సోషల్ మీడియాని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి ఫిలిం మేకర్స్.! ఎక్కడినుంచో గుట్టు చప్పుడు లేకుండా లేపేశాం.. అనుకుంటే కుదరదు. గూగుల్ తల్లి అన్ని ‘కాపీ’ వ్యవహారాల్నీ పట్టిచేస్తోంది.. సోషల్ మీడియా ఏకి పారేస్తోంది.!
సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి ‘వారసుడు’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. తమిళ హీరో విజయ్‌తో.!
కాస్ట్యూమ్స్ కూడా కాపీ కొట్టేస్తే ఎలా.?
‘మహర్షి’ సినిమా కోసం వాడిన కాస్ట్యూమ్స్‌ని ‘వారసుడు’ కోసం వంశీ పైడిపల్లి వాడేశాడంటూ సోషల్ మీడియా వేదికగా ఇటు మహేష్ అభిమానులు అటు విజయ్ అభిమానులు ర్యాగింగ్ చేసి పారేస్తున్నారు.
మహేష్ ‘మహర్షి’ సినిమాలో రెండు గెటప్పుల్లో కనిపిస్తాడు. ఒకటి స్టూడెంట్ రోల్.. ఇంకోటి సీఈవో గెటప్. సీఈవో లుక్ కోసం వాడిన కోటునీ, మిమూలుగా వున్నప్పుడు మహేష్ ‘మహర్షి’ సినిమాలో వేసిన టీ షర్టునీ.. యదాథతంగా ‘వారసుడు’ కోసం వాడేసినట్లు కనిపిస్తోంది.
మేకింగ్ ఏవీ వచ్చాక, ‘వారసుడు’లో కాపీ వ్యవహారం అందరికీ అర్థమయిపోయింది. మరీ ఇంత కక్కుర్తి ఏంటి.? అంటూ ఇటు వంశీ పైడిపల్లి మీదా, నిర్మాత దిల్ రాజు మీదా సెటైర్లు పడుతున్నాయి. కనీసం కాస్ట్యూమ్స్ అయినా మార్చాలి కదా.? అంటూ నెటిజనం ర్యాగింగ్ చేస్తోంటే.. ఫాఫం దర్శకుడి పరిస్థితి ఎలా వుందో ఏమో.!