Rana Daggubati : వైల్డ్ వైల్డ్ మెన్ అంటూ య‌ష్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన రానా..!

NQ Staff - April 17, 2022 / 12:58 PM IST

Rana Daggubati : వైల్డ్ వైల్డ్ మెన్ అంటూ య‌ష్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన రానా..!

Rana Daggubati : కేజీఎఫ్ ఛాప్టర్ 1 అనే ఒక్క సినిమాతో హీరోగా యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా మారాడు. రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. తాజాగా ఈరోజు కేజీఎఫ్ 2 మూవీతో పలకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓ కన్నడ సినిమా ఇన్ని స్క్రీన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్.

కేజీఎఫ్ 2 చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఈ మూవీపై సామాన్యుల‌తో పాటు సెల‌బ్స్ కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, అద్భుతమైన విజువల్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి “కేజీఎఫ్-2” టీంను సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

“వైల్డ్ వైల్డ్ మెన్ మీరు మళ్లీ అద్భుతం చేశారు. యష్, ప్రశాంత్ నీల్ బాగా చేసారు. KGF టీం అందరికీ భారీ అభినందనలు” అంటూ రానా దగ్గుబాటి శాండల్‌వుడ్ మాగ్నమ్ ఓపస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రానా “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ పై స్పందించిన విషయం తెలిసిందే.

Congratulations to All the KGF2Team said Rana Daggubati

Congratulations to All the KGF2Team said Rana Daggubati

రానా నటించిన “విరాటపర్వం” విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ‘కేజీఎఫ్ 2’ విషయానికొస్తే… హోంబలే ఫిలింస్ మూవీని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కూడా నటించారు.

సినిమా చూసిన వెంటనే రజనీ .. ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ కి కాల్ చేసి ప్రశంసించారట. ఈ సినిమా టీమ్ కి అభినందనలు అందజేశారనీ, సినిమా తనకి చాలా బాగా నచ్చిందని చెప్పారనేది కోలీవుడ్ టాక్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి అలరించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us