Pavitra Lokesh : పవిత్ర లోకేష్ ఫిర్యాదుకు పోలీసుల రియాక్షన్
NQ Staff - November 27, 2022 / 05:09 PM IST

Pavitra Lokesh : సీనియర్ నటి పవిత్ర లోకేష్ తనపై కొందరు యూట్యూబ్ ఛానల్స్ వారు మరియు వెబ్సైట్స్ వారు అసభ్యకరంగా కథనాలు రాసి తన ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ తన పరువు కి భంగం కలిగిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పవిత్ర లోకేష్ యొక్క ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 15 యూట్యూబ్ ఛానల్స్ మరియు ఆ వెబ్సైట్స్ కి చెందిన వారికి పోలీసులు నోటీసులు పంపించారు.
పవిత్ర లోకేష్ యొక్క ఫిర్యాదు విషయమై మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. తనపై అసత్య ప్రచారం చేస్తున్న 15 యూట్యూబ్ ఛానల్స్ మరియు వెబ్సైట్స్ లింక్స్ తో సహా ఫిర్యాదుల పేర్కొన పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ రాసి ఇచ్చారట.
దాంతో వెంటనే చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇక మీదట తనపై ఎవ్వరు కూడా అసత్య ప్రచారం చేసినా కూడా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ పవిత్ర లోకేష్ ఈ పరిణామాలతో హెచ్చరించినట్లయ్యింది.