Comedian Yadamma Raju Seriously Injured : తీవ్రంగా గాయాల పాలైన యాదమ్మరాజు.. ఆస్పత్రిలో చేరిన కమెడియన్..!
NQ Staff - July 25, 2023 / 10:41 AM IST

Comedian Yadamma Raju Seriously Injured :
యాదమ్మ రాజు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఆయన ఎన్నో షోలతో అలరిస్తున్నాడు. పటాస్ షోతో మొదలైన ఆయన కెరీర్ వరుసగా షోలతో సాగుతోంది. మొన్నటి వరకు స్టార్ మాలో అలరించిన ఆయన ఇప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ సద్దాంతో కలిసి టీమ్ లీడర్ గా చేస్తున్నాడు.
అయితే ఇలా సాఫీగా సాగుతుండగా.. సడెన్ గా ఆయన ఆస్పత్రిలో చేరాడు. ఆయన తీవ్రంగా గాయాల పాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఆయన కుడి కాలికి గాయం అయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కాలికి కట్టుకట్టారు డాక్టర్లు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆయన ఇన్ స్టాలో పోస్టు చేశాడు.
ప్రమాదంలో గాయాలు..
ఆయన పక్కనే భార్య స్టెల్లా రాజ్ కూడా ఉన్నారు. యాదమ్మ రాజును ఆమె దగ్గరుండి మరీ చూసుకుంటోంది. ఈ వీడియోను చూసిన ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైందో ఎవరికీ తెలియట్లేదు. ప్రమాదానికి గల కారణాలను స్టెల్లా ఇంకా తెలియజేయలేదు.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గతేడాది ఆయన తన లవర్ స్టెల్లాను పెండ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరగడంతో ఆయన కొన్ని రోజులు బుల్లితెర షోలకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది.