Comedian Ali And Zubeda Haldi : అలీ ఇంట మొదలైన పెళ్లి హడావుడి.. పిక్స్‌ వైరల్

NQ Staff - November 25, 2022 / 11:56 AM IST

Comedian Ali And Zubeda Haldi  : అలీ ఇంట మొదలైన పెళ్లి హడావుడి.. పిక్స్‌ వైరల్

Comedian Ali And Zubeda Haldi  : తెలుగు స్టార్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమయి చాలా రోజులు అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫాతిమా పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది.

ఇప్పటికే ఎంగేజ్మెంట్ వేడుకను భారీగా నిర్వహించిన అలీ ఫ్యామిలీ వివాహాన్ని కూడా అంతకు మించి అన్నట్లుగా నిర్వహిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,మెగాస్టార్ చిరంజీవితో పాటు తనకు ఇండస్ట్రీలో సన్నిహితులైన పలువురిని అని ఈ వివాహానికి ఆహ్వానించాడు.

పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న అలీ తాజాగా హల్దీ వేడుకను నిర్వహించాడు. అలీ కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ కార్యక్రమంలో చాలా ఆనందోత్సవాల మధ్య పాల్గొన్నారు.

పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని ప్రముఖులు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎక్కడ లోటు లేకుండా చూసుకోవాలంటే నిర్వాహకులకు అలీ సూచించాడని తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లి హంగామా కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us