OG Movie Latest Update : ఓజీ సినిమాలో నటిస్తున్న అలీ.. పవన్ తో విబేధాలు ముగిసినట్టేనా..?
NQ Staff - June 27, 2023 / 12:41 PM IST

OG Movie Latest Update : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ వారు పవన్ కల్యాణ్, అలీ. పవన్ అగ్ర హీరోగా ఉంటే.. అలీ స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. కాగా వీరిద్దరూ మొదటి నుంచి మంచి మిత్రులు. పవన్ సినిమా అంటే కచ్చితంగా అలీ ఉండాల్సిందే. అలా ఉండేది వీరిద్దరి ఫ్రెండ్షిప్.
అయితే రాజకీయాలకు వచ్చేసరికి వీరిద్దరి నడుమ విబేధాలు వచ్చాయి. పవన్ జనసేన పార్టీ పెడితే.. అలీ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా సలహాదారుగా ఉన్నారు. కాగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.
అప్పటి నుంచే ఇద్దరి నడుమ గ్యాప్ వచ్చింది. పవన్ తన సినిమాల్లో అలీని తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసిపోతున్నట్టు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఓటీ. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 50 శాంత షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ మూవీ నుంచి ఊహించని న్యూస్ వచ్చేసింది.
ఈ సినిమాలో అలీ నటిస్తున్నాడంట. త్వరలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో అలీ జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. పవన్, అలీ మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అంటే వీరిద్దరి నడుమ వస్తున్న విబేధాలు అన్నీ ముగిసిపోయినట్టేనా అని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన పిక్స్ వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.