Godfather : మాట తప్పావ్ రామ్ చరణ్.! ఏకిపారేస్తున్న నెటిజనం.!

NQ Staff - October 7, 2022 / 02:03 PM IST

Godfather  : మాట తప్పావ్ రామ్ చరణ్.! ఏకిపారేస్తున్న నెటిజనం.!

Godfather  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల వసూళ్ళకు సంబంధించి పోస్టర్లపై ఎలాంటి ‘నంబర్స్’ వుండబోవంటూ స్పష్టం చేసిన విషయం విదితమే. నిర్మాతలకు కూడా ఈ విషయమై స్పష్టమైన సూచన చేసినట్లు చెప్పాడు చరణ్.

‘సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జనం డిసైడ్ చేయాలి. ఎన్ని కోట్లు వసూలు చేసిందనేది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చూసుకుంటారు.. పోస్టర్లపై కనిపించే లెక్కల వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనమూ వుండదు..’ అంటూ అప్పట్లో చరణ్ వ్యాఖ్యానించాడు.

తనయుడికి మద్దతు తెలిపిన చిరంజీవి..

చరణ్ తీసుకున్న నిర్ణయం సబబేననీ, ఈ విషయంలో తాను తన కుమారుడ్ని చూసి గర్వపడుతున్నాననీ, తానూ అదే బాటలో నడుస్తానని చిరంజీవి చెప్పారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. ‘గాడ్ ఫాదర్’ సినిమాకి సంబంధించి వసూళ్ళ లెక్కల్ని అధికారికంగానే పోస్టర్ల ద్వారా వెల్లడిస్తున్నారు.

అయితే, ఈ వివరాలపై యాంటీ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ నిర్మాణ సంస్థల్లో ఒకటైన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధినేత రామ్ చరణ్. ఈ నేపథ్యంలో ‘మాట తప్పావ్ రామ్ చరణ్..’ అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.

కానీ, మెగా కాంపౌండ్ మీద దుష్ప్రచారం చాలా తీవ్రంగా జరుగుతున్న దరిమిలా, ఈ నెంబర్లతోనే కౌంటర్ ఎటాక్ చేయక తప్పడంలేదన్నది అట్నుంచి వస్తున్న ఓ వాదన.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us