Chiyaan Vikram : విక్రమ్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.. ప్రీ రిలీజ్ వేడుకకి హాజరై ఆశ్చర్యపరచిన చియాన్
NQ Staff - July 12, 2022 / 05:39 PM IST

Chiyaan Vikram : తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం చూపించాలని చాలా కష్టపడుతుంటారు. అయితే విక్రమ్‌కి ఇటీవల ఒంట్లో నలతగా ఉండటంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులకి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో విక్రమ్ ఇంటికి చేరుకున్నారు.
శభాష్ విక్రమ్..
మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో విక్రమ్ ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని ప్రార్థించారు. అయితే ఈ వార్తలను కావెరీ ఆస్పత్రి వైద్యులు, ఆయన తనయుడు ధృవ్ కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఛాతిలో కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో ఆయన ఆస్పత్రికి వచ్చారని స్పష్టం చేశారు.
ఆ తర్వాత విక్రమ్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్ చేసింది. అది తన ఇంటి నుంచి రిలీజ్ చేశారని, ఇందులో ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది తాజా వీడియో కాదని , విక్రమ్ తన బర్త్ సందర్భంగా 2017లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన ఈ వీడియో అని చెప్పారు.

Cobra Movie Audio Launch Event Chiyaan Vikram
ఇక విక్రమ్ తన తాజా చిత్రం కోబ్రా ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు కానున్నాడని వార్తలు రాగా, కొందరు అభిమానులు తమ అభిమాన హీరోని రిస్క్ చేయవద్దని కోరారు. కాని నిన్న జరిగినటువంటి ఆడియో వేడుకలో నిజంగానే విక్రమ్ కనిపించి ఆశ్చర్యపరిచాడు. తన సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ని తెలియజేస్తూ అభిమానుల కోసం రావడంతో వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి జ్ఞ్యానవేల్ ముత్తు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతుంది. అయితే విక్రమ్ డెడికేషన్‌కి హ్యాట్రాఫ్ అని అనకుండా ఉండలేక పోతున్నారు.
విక్రమ్ సినిమాల విషయానికొస్తే.. ఈయన ముఖ్య పాత్రలో నటించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ఇటీవల టీజర్ విడుదలైంది. ఈ టీజర్ విజువల్ గ్రాండియర్‌గా ఉంది. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో విక్రమ్ ఆదిత్య కరికాలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ అంచనాలే ఉన్నాయి.