Bandla Ganesh : బచ్చన్ డైలాగులకే కాదు.. బండ్ల గణేష్ స్పీచ్ కు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ ఈవెంట్ లో ఏ హీరోని ఎంతలా పొగుడుతారో? ఎలాంటి పదాలు, ప్రాసలు వాడతారో, ఆడియెన్స్ కి ఎంత హై ఇస్తాడో అంటూ ఆయన స్పీచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేసేవాళ్లు లేకపోలేదు. ఆ క్రేజ్ ఎంతవరకూ వెళ్లిందంటే పలానా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్లన్న రావట్లేదా? అంటూ సోషల్మీడియాలో పోస్టులు, మీమ్స్ వేసేంత ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.
కొంత ఆవేశం, కొంత ఎలివేషన్, కొంత మసాలాతో తన ప్రతి స్పీచునూ అదరగొడతాడు బండ్ల. అయితే రీసెంట్ గా ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన స్పీచ్ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఎవరిని టార్గెట్ చేస్తూ, ఎవరికి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లిస్తూ చురకలింటించాడో అన్నది ఇంట్రస్టింగ్ టాపికయింది.

”ఈ ఫంక్షన్ కి వదిన లావణ్య ఫోన్ చేస్తే వచ్చా. ఓ తల్లి, అమ్మ, భార్య అంటే లావణ్యలా ఉండాలి. సీతాదేవికున్నంత ఓర్పుంది ఆవిడకి” అంటూ పొగుడుతూ మాట్లాడడం వరకూ ఓకే. అది బండ్ల స్టయిల్ ఆఫ్ స్పీచ్ అనుకోవచ్చు. కానీ ఆ తర్వాతి మాటలే ఆసక్తికరంగా మారాయి.
”పూరీ పెద్ద డైరెక్టర్ అవుతాడు, భూమి బద్దలు కొట్టేస్తాడు, ఇండస్ట్రీని దొబ్బేస్తాడు అని పెళ్లిచేసుకోలేదావిడ. ఆయన జేబులో వందో రెండొందలో ఉన్నా నచ్చాడని లవ్ చేసి సనత్ నగర్ టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు పూరీ స్టారయ్యాక చాలామందొచ్చారు కానీ. ముందొచ్చింది ఈ మహాతల్లే.”
- Advertisement -
సరిగ్గా ఈ మాటలు ఎవరిని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ అన్నాడు? అసలే చాలారోజులుగా పూరీ మీద చాలా రకాల రూమర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడ్తున్నాయి. ఆయన రిలేషన్స్ మీద ఓ రకంగా ఓపెన్ గానే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో స్టేజ్ మీద బండ్ల ఇలా కామెంట్స్ చేయడంతో ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరు? ఓరకంగా పూరీ ఫ్యామిలీ లైఫ్ లో వాళ్లవల్లే డిస్టబెన్స్ మొదలయ్యాయా అనే డౌట్స్ కి మరింత ఊతమిచ్చినట్టయింది. మరోవైపు అక్కడే ఉన్న ఆడియెన్స్ నుంచి కూడా అరుపులు, చప్పట్లతో పాజిటివ్ రియాక్షన్ రావడం ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.

బండ్ల గణేష్ ఇక్కడితోనే ఆగలేదుగా.
”పూరీ ఎందరో మామూలోల్లని స్టార్లు, సూపర్ స్టార్లను చేశాడు. డైలాగులు రానివాళ్లకు డైలాగులు నేర్పించాడు. డ్యాన్సులు రానివాళ్లకి డ్యాన్సులు నేర్పించాడు. కానీ ఈరోజు కొడుకు మూవీ ఫంక్షన్ జరుగుతుంటె బాంబేలో కూచున్నాడు. ఇదెక్కడి న్యాయం అన్నా? నువ్ చేసినా చేయకున్నా నీ కొడుకు స్టార్ అవుతాడు. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో నిలబడే రోజొస్తది. రాసిపెట్టుకో. నువ్ బ్యాంకాక్ వెళ్లి కథ రాసుకుని ఆకాష్ కత చెప్తా వినురా అనే రోజు రాకపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు.
ఆరోజు మీ నాన్నకి డేట్లివ్వకురా అని ఆకాష్ కి చెప్తా నేను”అంటూ ఓవైపు ఆకాష్ ని ఎలివేషన్స్ తో ఆకాశానికెత్తేస్తూనే పూరీకి చురకలంటించాడు. మరోవైపు ఆకాష్ కెరీర్ ని పూరీ సీరియస్ గా తీసుకోవట్లేదా? అని కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్న రూమర్స్ కి కొనసాగింపునిచ్చాడు.

” మనం ఆస్తులు సంపాదించినా వాళ్లకే. మనం అప్పులు చేస్తే కట్టేది వాళ్లే. మనం చస్తే తలకొరివి పెట్టేది మన కొడుకే.ఎప్పటికయినా పూరీ ఆకాష్ సన్నాఫ్ పూరీ జగన్నాథే. రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు. తీసుకున్నాక చచ్చేదాక వదలకూడదు”అంటూ చేసిన కామెంట్స్ అయితే ఆడియెన్స్ ని ఓ రకంగా షాక్ కి గురిచేశాయి. బండ్ల ఇంత లోతుగా, ఘాటుగా మాట్లాడడానికి రీజన్ ఏమయ్యుంటుంది అని చెవులు కొరుక్కుంటున్నారంతా. ఇవన్నీ పూరీని, ఆయన ఫ్యామిలీని, వాళ్ల మధ్యున్న రిలేషన్స్ ని ఎత్తిచూపే కామెంట్స్ అయితే, మరోవైపు ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ గురించి ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ కూడా సదరు హీరోల అభిమానుల్లోనూ డిబేటబుల్ పాయింట్సయ్యాయి.
”పూరీ గారి వల్ల హిట్స్ కొట్టిన హీరోలందరూ ఈరోజు వచ్చి సినిమా గురించి మాట్లాడతారని ఎక్స్ పెక్ట్ చేశా. పూరీ రైటింగ్ వల్ల డైలాగుల వల్ల స్టార్లయి వందల కోట్లు తీసుకుంటున్నవాళ్లున్నా, ఆయన కొడుకును ఎంకరేజ్ చేయడానికి రాలేదు. ఇండస్ట్రీలో ఇవి మామూలే. వాళ్ల బిజీ అది. ఆకాష్ స్టార్ అయితే మాకు ఇబ్బంది అనుకుంటున్నారు.”
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బాక్సాఫీస్ బంపర్ హిట్స్ పడి వసూళ్లవరద పారించిన హీరోలు కొందరున్నారు. వరుస డిజాస్టర్లతో డీలాపడుతున్న టైమ్ లో పూరీ చేతిలో పడితే సక్సెస్ పక్కా అని నమ్మిన స్టార్లూ ఉన్నారు. రొటీన్ ప్రాజెక్టులతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా మొనాటనీ ఫీల్ అవుతున్న టైమ్ లో,కొందరు బడా హీరోలకి కంటెంట్ తో పాటు లుక్స్ అండ్ అప్పీయర్సెన్స్, డైలాగ్ డెలీవరీ పరంగా కూడాకొత్తదనం చూయించి ఆ సెలబ్రిటీలకి ఓరకంగా రీబర్త్ ఇచ్చిన మూవీమేకర్ పూరీ. అయితే ఇప్పుడు అలాంటి హీరోలే ఆకాష్ సినిమా ఫంక్షన్ కి రాలేదు అన్నాడంటే..ఆ సోకాల్డ్ స్టార్స్ మీద కూడా బండ్ల స్టాంగ్ గానే సెటైర్ వేశాడా అనేది సోషల్మీడియాలో కాస్త గట్టిగానే నడుస్తున్న చర్చ.

అసలు బండ్ల గణేష్ ఏ ఇంటెన్షన్ తో, ఎవరికి తగలాలి అన్న పాయింట్ తో మాట్లాడాడో పక్కనపెడితే, ఆయన స్పీచ్ మాత్రం చాలారకాల గాసిప్స్ అండ్ స్పెక్యులేషన్స్ కి మరికొన్ని పాయింట్స్ ని యాడ్ చేసింది. పూరీ పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్, పిల్లల కెరీర్, స్టార్స్ తో ఆయన ర్యాపో.. ఇలా ఏ ఒక్క విషయాన్ని వదలకుండా వచ్చిన ఛాన్స్ ని బీభత్సంగా వాడేసుకుని కుండబద్ధలు కొట్టినట్టు, కొన్ని అనుమానాలకి అంటుకట్టినట్టు స్పీచ్ దంచికొట్టాడు బండ్లన్న. మరి ఈ మాటల్ని సీరియస్ గా తీసుకుని పూరీ ఏమైనా రియాక్ట్ అవుతాడా? ఏ రకంగానైనా రెస్పాన్స్ ఇస్తాడా? అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.