Cobra : ‘కోబ్రా’ టీజర్ టాక్ : విక్రమ్ విశ్వరూపం ఇంకోస్సారి.!
NQ Staff - August 25, 2022 / 09:12 AM IST

Cobra : తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడు. సినిమా కోసం ఎలాంటి రిస్క్‌లు చేయడానికైనా వెనుకాడదు. అలా లైఫ్ రిస్క్ చేసిన సినిమాల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమాని.

Chiyaan Vikram Cobra Official Teaser
తాజాగా విక్రమ్ ‘కోబ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ‘కోబ్రా’ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో లెక్కల మాస్టారు పాత్రలో విక్రమ్ నటిస్తున్నాడు.
పేరుకి లెక్కల మాస్టారే కానీ, మారు వేషాల్లో ఈ లెక్కల మాస్టారు ఆర్ధిక నేరాలకు పాల్పడుతుంటాడు. టీజర్‌లో రకరకాల వేషాల్లో కనిపించాడు విక్రమ్. ఆయనను పట్టుకునేందుకు ఓ స్పెషల్ పోలీస్ టీమ్. కానీ, దొరికితేగా.
ఓ సాధారణ లెక్కల మాస్టార్.. అంతర్జాతీయ స్థాయి క్రిమినల్..
ఎంతైనా లెక్కల మాస్టారు కదా.. లెక్క పక్కాగా వుంటుంది. అసలింతకీ మన లెక్కల మాస్టారు ఇంతలా తెగించడానికి కారణాలేంటీ.? అనేది తెలియాలంటే ‘కోబ్రా’ సినిమా చూడాల్సిందే.
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీ నిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పోలీసాఫీసర్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. అజయ్ జ్ఞాన్ ముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇటీవలే కొడుకు ధృవ్‌తో కలిసి ‘మహాన్’ సినిమాలో నటించి సెన్సేషనల్ అయిన విక్రమ్, ‘కోబ్రా’తో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తాడో చూడాలి మరి.