Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజవుతుందో లేదో చిరంజీవికే తెలియదా.?

NQ Staff - October 4, 2022 / 04:12 PM IST

Chiranjeevi  : ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజవుతుందో లేదో చిరంజీవికే తెలియదా.?

Chiranjeevi  : ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాళంలో విడుదలవుతోందంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ప్రచారం జరగడమేంటి.? మలయాళ వెర్షన్ తాలూకు పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. అయితే, మలయాళ వెర్షన్‌కి సంబంధించి ఎలాంటి వీడియో ప్రోమోస్ రాలేదు.

మలయాళ ‘లూసిఫర్’ సినిమానే తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నప్పుడు, మలయాళంలోకి మళ్ళీ ఆ ‘గాడ్ పాదర్’ని డబ్ చేయడమేంటి.? ఏమోగానీ, ఈ విషయమై మెగా సస్పెన్స్ కొనసాగుతోంది.

మెగాస్టార్ చిరంజీవికే క్లారిటీ లేదా.?

‘గాడ్ ఫాదర్’ సినిమాని మలయాళంలో ఎందుకు విడుదల చేస్తున్నారు.? అని చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘లేదు, మలయాళంలో రిలీజ్ అవడంలేదు..’ అని చిరంజీవి చెప్పేశారు. అంటే, చిరంజీవికి నిర్మాతల నుంచి సరైన సమాచారం లేదా.? చివరి నిమిషంలో మలయాళంలో సినిమాని విడుదల చేయకూడని అనుకున్నారా.? అన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి.

‘గాడ్ ఫాదర్’ సినిమాకి చిరంజీవి అన్నీ తానే అయి వ్యవహరించారు. అలాంటి చిరంజీవిని ‘మలయాల డబ్బింగ్’ ప్రశ్న అయోమయంలో పడేసిందంటే, ఏమనుకోవాలి.?

‘లూసిఫర్’లో మోహన్‌లాల్ నటించగా, పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఆ పృధ్వీరాజ్ ‘లూసిఫర్’లో చేసిన స్పెషల్ రోల్, తెలుగు ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us