Chiranjeevi : సల్మాన్ ఖాన్‌కి థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి.!

NQ Staff - October 7, 2022 / 10:24 PM IST

Chiranjeevi : సల్మాన్ ఖాన్‌కి థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి.!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌పై సూపర్ హ్యాపీగా కనిపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ‘భాయ్’ సల్మాన్ ఖాన్‌కి థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారాయన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘మసూమ్ భాయ్’ అనే పాత్రలో కనిపించిన విషయం విదితమే. ‘లవ్ యూ చిరంజీవిగారూ..’ అంటూ ఇటీవలే సల్మాన్ ఖాన్, ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌పై ఓ వీడియో విడుదల చేశాడు.

భాయ్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి…

సల్మాన్ ఖాన్ ఆ వీడియో విడుదల చేశాక, హిందీలో ‘గాడ్ ఫాదర్’ సినిమాకి వసూళ్ళు మరింతగా జోరందుకున్నాయ్. ఈ నేపథ్యంలో భాయ్ థ్యాంక్స్‌కి మెగాస్టార్ కూడా తనదైన స్టయిల్లో రిప్లయ్ ఇచ్చారు. దీన్ని రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా.? అంటే, ఔను.. ప్రేమపూర్వకమైన బహుమతి.. అంటున్నారు మెగాభిమానులు.. సల్మాన్ ఖాన్ అభిమానులు.

కాగా, ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం సల్మాన్ ఖాన్ అస్సలేమాత్రం రెమ్యునరేషన్ తీసుకోని విషయం విదితమే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో కనిపించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us