Chiranjeevi : 150 సినిమాల పెద్దరికం ఇదేనా చిరంజీవి?

NQ Staff - October 2, 2022 / 12:49 PM IST

Chiranjeevi  : 150 సినిమాల పెద్దరికం ఇదేనా చిరంజీవి?

Chiranjeevi  : అసలే మెగాస్టార్‌  చిరంజీవి ఫేట్ కొన్నాళ్లుగా బాలేదు, బ్యాడ్ టైమ్‌ బ్యాటింగ్ ఆపట్లేదని తెలుస్తూనే ఉంది. ఇలాంటి టైమ్‌ లో చిరు లేటెస్ట్ గా చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీ అండ్ సోషల్మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన సినిమా హిట్ అయితే మెగా మానియానా? ఫ్లాప్ అయితే దర్శకుడి తప్పా? మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తే చిరుకున్న క్రేజా? డిజాస్టరయితే డైరెక్టర్‌ చేతకానితనమా? అంటూ హార్ష్‌ గానే రియాక్టవుతున్నారు నెటిజన్స్‌ అండ్ ఆడియెన్స్.

అసలు మ్యాటరేంటంటే..

కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29 న రిలీజై ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్‌ తో డీలాపడింది.

చిరు, చరణ్ కలిసి నటించిన మొదటి చిత్రమయినా ఆ కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఏ మాత్రం వర్కవుట్ కాలేకపోయింది. సరే తర్వాతి సినిమాతో అయినా సక్సెస్ రాకపోతుందా అని అభిమానులు కూడా అప్ కమింగ్ మూవీ కోసం ఎదురుచూసే పనిలో పడ్డారు. కానీ రీసెంట్ గా గాడ్ ఫాదర్‌ ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య రిజల్ట్ గురించి మాట్లాడుతూ.. ‘మన పని మనం చేశామా, మనం బెస్ట్ ఇచ్చామా లేదా అన్నదే మన చేతిలో ఉంటుంది.

ఆచార్య విషయంలోనూ అదే జరిగింది. దర్శకుడు చెప్పిందే నటులుగా మేం చేశాం. కాకపోతే చరణ్, నేను కలిసి యాక్ట్‌ చేసిన ఫస్ట్ మూవీ ఆ రేంజ్‌ లో ఫ్లాప్‌ అయ్యేసరికి, ఫ్యూచర్లో మళ్లీ కలిసి సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్ కి ఎక్స్‌ పెక్ట్‌ చేసిన రేంజ్ లో హైప్ క్రియేటవ్వక పోవచ్చు. అదే కాస్త బాధపెట్టే విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు చిరు.

ఈ కామెంట్సే ఇప్పుడు వైరల్ గా మారడంతో రాజమౌళితో హిట్ కొట్టాక ఏ హీరో కయినా తర్వాతి సినిమా ఫ్లాపవ్వాల్సిందే. ఇప్పటి వరకూ ఏ యాక్టర్‌ ఆ సెంటిమెంట్ నుంచి తప్పించు కోలేదు, చరణ్‌ కి కూడా అదే జరిగిందందే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మరోవైపు ఆచార్య సినిమాని కొరటాల గనక డైరెక్ట్‌ చేసుంటే రిజల్ట్‌ ఇలా ఉండేది కాదంటూ ఇంకొందరు ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.
నిజానికి ఆ మూవీ ఫ్లాప్ వల్ల ఎక్కువగా ఎఫెక్టయింది డైరెక్టరే. కొరటాలకి దర్శకుడిగా కెరీర్లో ఫస్ట్ ఫ్లాప్‌ రావడమే కాకుండా లావాదేవీల్లోనూ ఇన్వాల్వ్ అయినందుకు చాలా లాసయ్యాడు. తనకున్న స్థలాన్ని కూడా అమ్మి కొన్ని సెటిల్మెంట్స్‌ చేశాడన్న వార్తలుకూడా వచ్చాయి.

ఇదే సమయంలో మిగతా స్టార్ హీరోలతో చిరుని కంపేర్‌ చేసి వీడియోలు, పోస్టులు మొదలైపోయాయి సోషల్మీడియాలో. మహేష్‌ బాబు ఓ ఇంటర్ వ్యూలో సరిగ్గా ఆడని చిత్రాల గురించి మాట్లాడుతూ.. ‘నేను నటించిన సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు నేనే రెస్పాన్సిబిలిటీ, హిట్ అయితే అందరూ రెస్సాన్సిబిలిటీ. ఎందుకుంటే ఆ కథని నేను ఓకే చేయకపోతే సినిమా ఉండేది కాదు. అలా సినిమాలు సక్సెస్‌ కానప్పుడు నేను చాలా బాధపడతాను. చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి లో గా ఫీలవుతా’ నంటూ చెప్పుకొచ్చాడు మహేష్‌.

మరోవైపు బాలయ్య కి కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులు పడ్డాయి. సినిమా సినిమాకి ట్రోల్స్‌ పెరుగుతూ వచ్చాయి. కానీ త్రిబులార్‌ ప్రమోషన్స్‌ టైమ్‌లో రాజమౌళి ఓ మాట చెప్పాడు. ‘ చాలా కాలంగా బాలక్రిష్ణగారితో ట్రావెలవుతున్నాను. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా
ఆ డైరెక్టర్‌ ఇలా తప్పు చేశాడు, ఆ డైరెక్టర్‌ వల్లే ఇలా జరిగింది అని ఒక్క దర్శకున్ని కూడా పళ్లెత్తు మాటనడం నేను వినలేదు. అట్టర్ ఫ్లాపయినా సినిమా అయినా సరే. డైరెక్టర్‌ బాగా చేయలేదంటూ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా నేను వినలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న.

ఇలా బడా హీరోలతో పాటు యంగ్‌స్టార్ హీరోలు కూడా దర్శకులని కామెంట్ చేయకుండా, నిందంతా వాళ్లమీదే వేయకుండా సినిమా అన్నాక అందరం కలిసి పనిచేస్తాం, ఏ ఫలితమొచ్చినా అందరిదీ బాధ్యత అన్నట్టుగా ఉంటే.. 150 సినిమాలు చేసిన అనుభవముండీ,
ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తూ చిరంజీవి మాత్రం ఇలా ఓ డైరెక్టర్ ని బ్లేమ్‌ చేసి మాదేం తప్పులేదంటూ చేతులు దులుపుకునేలా మాట్లాడడం ఏంటంటూ కాస్త ఘాటుగానే కామెంట్స్‌ పడుతున్నాయి.

ఇలాంటి మాటలవల్ల రేపు  ఏ దర్శకుడయినా మెగాస్టార్‌ తో కాస్త ఎక్స్‌ పెరిమెంటల్ ప్రాజెక్టో, కొత్త తరహా కథో చేయడానికి కచ్చితంగా వెనుకంజ వేస్తారు కదా అంటూ కొశ్చన్ చేస్తున్నారు కొందరు.
మరి ఇన్ని రకాల నెగిటివ్ కామెంట్స్‌ విన్నాకయినా, తన తర్వాతి ప్రాజెక్టులు, యంగ్‌ మేకర్స్‌ మీద ఎఫెక్ట్‌ పడకుండా ఉండటానికయినా చిరు తన మాటలపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us