Chiranjeevi And Surya : నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్‌కి విషెస్ తెలిపిన చిరంజీవి.. సూర్య‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు

NQ Staff - July 23, 2022 / 08:00 PM IST

Chiranjeevi And  Surya : నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్‌కి విషెస్ తెలిపిన చిరంజీవి.. సూర్య‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు

Chiranjeevi And Surya : శుక్ర‌వారం కేంద్ర ప్ర‌భుత్వం 68వ జాతీయ అవార్డులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అనేక భాషలకి సంబంధించి ఉత్తమ చిత్రాలు, నటీనటులు ఇంకా ఇతర కీలక క్యాటగిరీ లలో అవార్డులు అనౌన్స్ చేశారు. మరి మన తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ భాషల్లో అనేక చిత్రాలు దర్శకులు సంగీత దర్శకులు కూడా గెలుచుకోగా వారి అందరికీ మెగాస్టార్ వరుసగా కంగ్రాట్స్ తెలియజేసారు.

అవార్డ్ విన్న‌ర్స్‌కి శుభాకాంక్ష‌లు..

Chiranjeevi Says Special Birthday wishes to Surya

Chiranjeevi Says Special Birthday wishes to Surya

తెలుగు నుంచి “కలర్ ఫోటో” టీం కి అలాగే “నాట్యం” చిత్ర యూనిట్ లకు మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్ తెలపగా తమిళ్ లో అవార్డుల పర్వం అందుకున్న చిత్రం “ఆకాశం నీ హద్దురా” దర్శకురాలు సుధా కొంగర, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ అలాగే మళయాళం నుంచి “అయ్యప్పణం కోషియం” టీం అందరికీ కూడా తన బెస్ట్ కంగ్రాట్స్ ని తెలియజేస్తున్నానని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

శ‌నివారం సూర్య జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ బ‌ర్త్ డే మీకు నిజంగానే ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని చిరు గుర్తు చేశారు. పుట్టిన రోజు నాడే జాతీయ అవార్డుకు ఎంపిక కావ‌డం అరుద‌ని, అలాంటి అరుదైన అవ‌కాశం మీకు ద‌క్కిందంటూ సూర్య‌కు చిరు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.

Chiranjeevi Says Special Birthday wishes to Surya

Chiranjeevi Says Special Birthday wishes to Surya

ఇలాంటి మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని, మ‌రిన్ని అవార్డులు మీ కోసం ఎదురు చూస్తున్నాయంటూ సూర్య‌కు చిరు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా బ్యాక్ డ్రాప్‌గా త‌న ఫొటో ఉన్న పెయింటింగ్ ముందు సూర్య నిలుచున్న‌ట్లుగా ఓ ఫొటోను చిరు పోస్ట్ చేశారు. అలానే త‌న ఫ్రెండ్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి సైతం విషెస్ తెలిపారు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us