Chiranjeevi And Renu Desai : చిరంజీవి నమస్కారం పెట్టిన రేణు దేశాయ్ పట్టించుకోలేదేంటి.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్
NQ Staff - April 3, 2022 / 02:29 PM IST

Chiranjeevi And Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణూ ఎక్కువగా పూణేలో ఉంటుంది. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వస్తుండగా, రేణూ మాత్రం మెగా కుటుంబానికి కాస్త డిస్టెయిన్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే ఆమె మెగా కుటుంబాన్ని ఫేస్ చేయాల్సి వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా మంది ఎదురు చూస్తుంటారు.
టైగర్ నాగేశ్వరరావు ఈవెంట్లో చిరంజీవి, రేణు దేశాయ్ ఓ వేడుకలో కలుసుకోవాల్సి వచ్చింది. రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
చిరంజీవి వేడుకలో ఉన్న ప్రముఖులందరినీ పలకరించారు. అయితే రేణు దేశాయ్ చూసి చూడనట్లు ఉన్నట్లు అనిపించింది. కానీ చిరంజీవిని రేణు మాత్రం చిరునవ్వుతోనే చూస్తున్నారు. చిరంజీవి – రేణు దేశాయ్ పలకరించుకున్నట్లు స్పష్టంగా కనపడలేదు. సదరు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చిరు నమస్కారం పెట్టిన ఎందుకు పెట్టలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Chiranjeevi Renu Desai Manifestations are not Clear
పవన్‌తో పెళ్లి తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత కూడా నటిగా సినిమాలకు దూరంగా ఉన్నారే కానీ.. టెక్నీషియన్‌గా సినిమాలకు ఆమె దూరం కాలేదు. రేణు దేశాయ్ దర్శకురాలిగా ఓ సినిమాను రూపొదించారు. ఇన్నాళ్లు యాక్టింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన రేణు ఇప్పుడు మళ్లీ నటించబోతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావులో నటిస్తున్నారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ కథను ప్యాండమిక్ సమయంలో దర్శకుడు వంశీ చాలా అద్భుతంగా నాకు వినిపించారు. ఆ తర్వాత ఈ సినిమా చేసేందుకు నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.