Chiranjeevi : చిరంజీవి గ్రాఫ్‌ తగ్గుతుందా ఏంటీ?

NQ Staff - October 22, 2022 / 10:38 AM IST

Chiranjeevi : చిరంజీవి గ్రాఫ్‌ తగ్గుతుందా ఏంటీ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో కనీసం 20 కోట్ల కలెక్షన్స్ ని కూడా ఆచార్య చిత్రం రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఆ సినిమాకు సక్సెస్ టాక్‌ దక్కడం తో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి, బ్రేక్ ఈవెన్ సాధించిందా లేదా అనే విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సక్సెస్ అయింది కనుక మళ్ళీ ఆయన తదుపరి సినిమా 100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని అంతా భావించారు.

కానీ మెగా 154 సినిమా కేవలం 85 కోట్లు మాత్రమే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆచార్య నుండి మొదలుకొని తగ్గుతూ తగ్గుతూ చిరంజీవి సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి గ్రాఫ్ తగ్గుతుందా అంటూ చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ ని రిస్క్ లో పెట్టకుండా చిరంజీవి సినిమాలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు.

సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ అయితే కచ్చితంగా భారీ లాభాలు వస్తాయి, కనుక ముందస్తుగా డిస్ట్రిబ్యూటర్స్ ని కష్టపెట్టొద్దని ఉద్దేశంతో తక్కువ మొత్తానికి అమ్ముతున్నారంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముందు ముందు మెగాస్టార్ సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరుగుతుందో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us