Chiranjeevi : గాడ్‌ ఫాదర్‌ 2వ రోజు కలెక్షన్స్‌

NQ Staff - October 7, 2022 / 02:43 PM IST

Chiranjeevi : గాడ్‌ ఫాదర్‌ 2వ రోజు కలెక్షన్స్‌

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజే 38 కోట్ల షేర్ కలెక్షన్స్ ని నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండవ రోజు కూడా ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్స్ ని దక్కించుకున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

గాడ్ ఫాదర్ కలెక్షన్స్ చూస్తుంటే మొదటి మూడు నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి రోజు ఏమాత్రం తగ్గకుండా రెండవ రోజు కలెక్షన్స్ నమోదు అవ్వడంతో లాంగ్‌ వీకెండ్‌ కచ్చితంగా గాడ్ ఫాదర్ కి గుడ్ అవ్వబోతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం రన్‌ ముగిసే సమయంకు ఈ సినిమా రూ. 150 కోట్ల సాలిడ్ కలెక్షన్స్ తో టాప్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాతో విడుదలైన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఈ సినిమా వసూళ్లు భారీ ఎత్తున నమోదు అవుతున్నాయి.

రెండో రోజు ఈ సినిమాకు దాదాపుగా 30 కోట్ల కలెక్షన్స్ నమోదు అయినట్లుగా సమాచారం అందుతుంది. మరింత ఎక్కువగా ఈ సినిమాకు వసూళ్లు ఉండే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us