Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ‘బాస్ పార్టీ’ అంటే ఇలా వుంటుంది మర.!
NQ Staff - December 16, 2022 / 01:57 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని మాస్ మూలవిరాట్టు.. అంటూ దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సరికొత్తగా పరిచయం చేస్తున్నాడు. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఆల్రెడీ ‘బాస్ పార్టీ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియో బయటకు వచ్చింది. విడుదలవుతూనే ‘బాస్ పార్టీ’ సాంగ్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యింది. అదే సమయంలో ట్రోలింగ్ కూడా ఈ సాంగ్ మీద నడుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ టీమ్ బాస్ పార్టీ..
‘వాల్తేరు వీరయ్య’ చిత్ర నిర్మాతలు, దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరో చిరంజీవి.. ఇలా అందరూ కలిసి ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియోను టీమ్ తాజాగా విడుదల చేసింది.
అంతే కాదు, ఇలాంటి వీడియోల్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండంటూ ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ సగటు సినీ అభిమానుల్ని కోరుతోంది. ఇకనేం, చిరంజీవి స్వయంగా అడిగాక అభిమానులు ఆగుతారా.? ఎడా పెడా వీడియోలు వదులుతున్నారు ‘బాస్ పార్టీ’ పేరుతో.
చిరంజీవి ఏమాటకామాటే చెప్పుకోవాలి.. చిరంజీవి మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నారు.