Chiranjeevi : ‘ఆచార్య’ డిజాస్టర్ : దర్శకుడు కొరటాల శివపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.!
NQ Staff - October 1, 2022 / 06:48 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ కనీ వినీ ఎరుగని రీతిలో డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.
చిరంజీవి, చరణ్.. ఇద్దరూ కలిసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలన్న చిరంజీవి సతీమణి కోరిక నెరవేరినా, ఆ సినిమా మెగా కుటుంబానికి ఓ పీడకలగా మిగిలిపోయింది. ఈ సినిమా విషయమై ఇప్పటికే పలుమార్లు స్పందించారు చిరంజీవి.
కొరటాల శివ చెప్పిందే చేశాం..
‘‘దర్శకుడు కొరటాల శివ చెప్పిందే చేశాం. అంతకు మించి, సినిమా వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. చేసే పని పట్ల అంకిత భావంతో పని చేయడమే మాకు తెలిసిన పని. కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రాజెక్టులు వర్కవుట్ అవవు. అంతే. ‘ఆచార్య’ విషయంలో వేరే బాధ ఏమీ లేదు..’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు.
కాకపోతే, ‘నేను, చరణ్ కలిసి నటించిన సినిమా కదా.! మళ్ళీ అలాంటి హైప్ ఇంకోసారి వస్తుందో లేదో తెలియదు. అలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుందో కూడా తెలియదు.. అదొక్కటే బాధ..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
సినీ పరిశ్రమలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన చిరంజీవి, ‘ఆచార్య’ సినిమాని మరీ అంత సీరియస్‌గా తీసుకుంటారని అనుకోలేం. ఆ మాటకొస్తే, పవన్ కళ్యాణ్ – చిరంజీవి కలిసి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ కూడా డిజాస్టర్ అయ్యింది.