Chiranjeevi : డోకిపర్రు శ్రీవారి సేవలో చిరంజీవి, సురేఖ‌..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు కుటుంబ స‌భ్యుల‌తో సెల‌బ్రేష‌న్స్ ఇంకోవైపు సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌డం వంటివి చేస్తున్నారు. రీసెంట్‌గా అమ‌రావ‌తి వెళ్లి సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి ఆయ‌న‌తో ప‌లు విష‌యాలు గురించి ముచ్చిటించిన చిరంజీవి తాజాగా సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు.

Chiranjeevi and Surekha in sankranthi celebrations
Chiranjeevi and Surekha in sankranthi celebrations

ఆలయ వర్గాలు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది. డోకిపర్రు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన ప్రాంగణంలోని ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని, గోదాదేవి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఆచార్య చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’, కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తున్నారు. మ‌రోవైపు ఆయన ఇప్పుడు ఫెస్టివ‌ల్ మూడ్‌లో ఉన్నారు. తాజాగా భోగి వేడుక‌లు ఆయ‌న ఇంట ఘ‌నంగా జ‌రిగాయి. ఉదయాన్నే భోగి మంటలు వేయడమే కాదు.. వరుణ్ తేజ్ తో కలిసి దోసెలు వేసి మిగతా సభ్యులకు అందించారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోని షేర్ చేసారు. ఇందులో చిరంజీవితో కలిసి వరుణ్ దోసెలు చేయడం మనం చూడవచ్చు. అయితే వరుణ్ దోసె బాగా వచ్చింది.. చిరు దోసె సరిగ్గా రాలేదు. దీంతో వెంటనే వరుణ్ వేసిన దోసెను చెడగొట్టాడు చిరు. ”వాడిది బాగా వచ్చింది.. నాది సరిగ్గా రాలేదు.. నాకు కుళ్ళు వచ్చేసింది” అంటూ చిరంజీవి ఫన్నీగా మాట్లాడుతూ అందరినీ నవ్వించడం కనిపిస్తుంది.

ఇందులో చిరంజీవి తల్లి అంజనీ దేవితో పాటుగా నాగబాబు దంపతులు – మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ – మెగా డాటర్ నిహారికను చూడవచ్చు. చిరంజీవి కూడా భోగి వేడుక‌ల‌కు సంబంధించిన వీడియె ఒక‌టి షేర్ చేయ‌గా,ఇది వైర‌ల్ అయింది.