Ramesh Babu : ర‌మేష్ బాబు మృతి ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Ramesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట్లో విషాదం నెల‌కొంది. కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే (రాత్రి 10గం. ప్రాంతంలో) రమేశ్‌బాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Chiranjeevi and Pawan Kalyan about Ramesh babu death
Chiranjeevi and Pawan Kalyan about Ramesh babu death

ర‌మేష్ బాబు మృతితో ఇండ‌స్ట్రీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. రమేష్ బాబు మృతికి పలువురు సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రమేష్ బాబు మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. టుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు.

రమేష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలోకి వచ్చి విజయాలు అందుకున్నారని గుర్తు చేశారు పవన్. సోదరుడు మహేష్ బాబుతో ‘అర్జున్’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ ఇప్పుడు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిది. ఆయనకు, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.

ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఊహించని విషాద ఘటనపై స్పందించారు. “శ్రీ ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యి ఎంతో బాధ పడ్డాను. శ్రీ కృష్ణ గారు, మహేష్ మరియు వారి కుటుంబం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ హృదయ విదారక నష్టాన్ని తట్టుకునే విధంగా ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని చిరు ఘట్టమనేని కుటుంబంలో జరిగిన ఈ విషాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1965, అక్టోబర్‌ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించారు రమేశ్‌బాబు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు.

‘దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్‌’వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’లో తొలిసారిగా టీనేజ్‌ ప్రధాన పాత్ర చేశారు. రమేశ్‌ సోదరుడు మహేశ్‌బాబుకు బాలనటుడిగా ఇదే తొలి చిత్రం. దాసరి ‘పాలు నీళ్లు’లోనూ రమేశ్‌ ప్రధాన పాత్రలో కనిపించారు.