Chiranjeevi : వైసీపీ రాజ్య‌స‌భ సీటు ఇచ్చింద‌నే వార్త‌ల‌పై స్పందించిన చిరంజీవి

Chiranjeevi : ఏపీ సినిమా టిక్కెట్ల విష‌యంలో నిన్న సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. అంతేకాదు త్వ‌ర‌లో ప్ర‌భుత్వం నుండి గుడ్ న్యూస్ రానుంద‌ని ఆయ‌న నోటి నుండి వ‌చ్చింది.

Chiranjeevi about politics and Rajya Sabha
Chiranjeevi about politics and Rajya Sabha

జ‌గ‌న్‌ని క‌లిసిన‌ప్ప‌టి నుండి చిరంజీవి రాజ‌కీయాల‌లోకి వెళుతున్నార‌ని, వైసీపీ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసింద‌ని ప్ర‌చారం న‌డిచింది. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని హీరో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వైసీపీ నాకు రాజ్య‌స‌భ ఆఫ‌ర్ చేసింద‌నేది అవాస్త‌వ‌మ‌ని చెప్పారు. నేను అలాంటి ఆఫ‌ర్లు కోరుకోన‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని చిరంజీవి మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు.

ప‌ద‌వులు ఆశించే వ్య‌క్తిని కాద‌న్నారు చిరంజీవి. రాజ్య‌స‌భ సీటు అనే మాట కేవ‌లం ప్రచార‌మ‌ని తెలిపారు. అస‌త్య ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కాగా నిన్న ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి వెల్లడించారు.

సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత చిరంజీవికి రాజ్యసభ పదవిని ఇస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని చిరంజీవి కొట్టిపారేశారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్ర‌జారాజ్యం పార్టీ 18 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకొంది. అయితే ప్రజా రాజ్యం పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేశారు. ఈ విలీనం తర్వాత చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించింది.

అయితే ఉమ్మడి రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి కేంద్ర మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతి నుండి కూడా చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, చిరంజీవి ఈ సాయంత్రం మళ్లీ ఏపీకి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి కుటుంబం హాజర‌యింది. కాగా ఎయిర్ పోర్ట్ లో రాజ‌కీయాల‌పై స్పందించారు మెగాస్టార్.