Chiraneevi : మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్.. వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiraneevi : మెగా ఫ్యామిలీ ఏ వేడుక అయిన క‌లిసిక‌ట్టుగా సంతోషంతో జ‌రుపుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి పండుగ‌కు చిరంజీవి, అల్లు అర‌వింద్ ఫ్యామిలీ, తేజ్ ఫ్యామిలీ , నాగ‌బాబు ఫ్యామిలీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యామిలీ ఒకే చోట చేరి తెగ సంద‌డి చేస్తుంటారు. తాజ‌గా సంక్రాంతిక వీరంద‌రు ఒకే చోట చేరారు.

Chiraneevi shares a video about Sankranti
Chiraneevi shares a video about Sankranti

కుటుంబ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. నేడు భోగి పండుగను కూడా అదే విధంగా హైదరాబాద్ లోని తన ఇంట్లో జరుపుకుంటున్నారు చిరు. ఉదయాన్నే భోగి మంటలు వేయడమే కాదు.. వరుణ్ తేజ్ తో కలిసి దోసెలు వేసి మిగతా సభ్యులకు అందిస్తున్నారు.

ఈ రోజు ఉద‌యం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోని షేర్ చేసారు. ఇందులో చిరంజీవితో కలిసి వరుణ్ దోసెలు చేయడం మనం చూడవచ్చు. అయితే వరుణ్ దోసె బాగా వచ్చింది.. చిరు దోసె సరిగ్గా రాలేదు. దీంతో వెంటనే వరుణ్ వేసిన దోసెను చెడగొట్టాడు చిరు. ”వాడిది బాగా వచ్చింది.. నాది సరిగ్గా రాలేదు.. నాకు కుళ్ళు వచ్చేసింది” అంటూ చిరంజీవి ఫన్నీగా మాట్లాడుతూ అందరినీ నవ్వించడం కనిపిస్తుంది.

ఇందులో చిరంజీవి తల్లి అంజనీ దేవితో పాటుగా నాగబాబు దంపతులు – మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ – మెగా డాటర్ నిహారికను చూడవచ్చు. ఇక తాజ‌గా చిరంజీవి భోగి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మెగా ఫ్యామిలీ అంద‌రిని చూపించారు.

వీరంద‌రు ఎంతో సంతోషంతో పండుగ జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వేడుక‌లో మిస్ కాగా, ఎప్ప‌టిలానే శ్రీజ భ‌ర్త‌ ఇక్క‌డ క‌నిపించలేదు. ప్ర‌స్తుతం చిరంజీవి షేర్ చేసిన వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.