Celebrities : సినీ పరిశ్రమను ఏలుతున్న ఈ కుర్రాడిని గుర్తుప్టటారా..?
NQ Staff - June 22, 2023 / 01:21 PM IST

Celebrities : సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే బాగా పాపులర్ అవుతోంది. వారి వ్యక్తిగత ఫొటోలను కూడా అప్పుడప్పుడు వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ నడుమ అయితే చిన్నప్పటి ఫొటోలను బాగా వైరల్ చేస్తున్నారు. పైగా ఇలాంటి ఫొటోలను పెట్టి ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి అంటూ ఫజిల్ ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా మరో ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఓ వ్యక్తి చేతిలో ఉన్న కుర్రాడు నవ్వులు చిందిస్తున్నాడు.
ఆ కుర్రాడు ఎవరో మీరు గుర్తు పట్టారా.. అతను ఓ సంచలన దర్శకుడు. ఆయన సినిమా తీస్తే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. ఆయన సినిమాలో నటిస్తే ఎవరికైనా పాన్ ఇండియా స్టార్ స్టేటస్ రావాల్సిందే. అపజయం అంటూ ఎరగని దర్శకుడు ఆయన. ఇప్పటికే ఆయన ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది.

Childhood Photos Of Movie Celebrities Are Going Viral
ఏంటి రాలేదా.. అయితే మేం చెబుతాం వినండి. ఆయన ఎవరో కాదు మన దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఒక్కో సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీయడం రాజమౌళి ఆయన స్టైల్. ఇప్పుడు మహేశ్ బాబుతో ఓ సినిమా తీయబోతున్నాడు ఆయన.