Chandra Babu Naidu : చంద్ర‌బాబుపై సినిమాలు తీసిన ఆర్జీవి.. తొలిసారి స్పందించిన ఏపీ మాజీ సీఎం

Chandra Babu Naidu : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజురోజుకి ఫుల్ హీటెక్కుతున్నాయి. అధికార పార్టీలు, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల దాడి చేసుకుంటున్నారు. అధికార వ‌ర్గం అయితే ప్ర‌తి విష‌యంలోను టీడీపీ పార్టీని లాక్కొచ్చి వారిపై విమ‌ర్శిస్తున్నారు. రీసెంట్‌గా ఏపీ సినిమా టిక్కెట్ల విష‌యంలోను టీడీపీని లాగ‌డంతో చంద్ర‌బాబు స్పందించారు.

Chandra Babu Naidu about tollywood ap theater tickets rates
Chandra Babu Naidu about tollywood ap theater tickets rates

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం.. అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ ప్ర‌ముఖులు. తాజాగా రామ్ గోపాల్ వర్మ .మంత్రి పేర్ని నాని తో భేటీ అయ్యారు. ఆ సమయంలో మంత్రి స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేశారు. టికెట్ల రేట్ల విషయంలో చేసేది ఏమీలేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు తాజాగా ప్రభుత్వం వేసిన కమిటీ సమావేశమైన ఈ అంశంపై చర్చింది.

సినిమా టిక్కెట్ల ఇష్యూని త‌మను లాగ‌డంపై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అసలు తన‌కు సినిమా ఇండస్ట్రీ సహకరించలేదన్నారు.. తాను సీఎంగా ఉన్న సమయంలో వ్యతిరేకంగా సినిమాలు చేశారని గుర్తు చేశారు. ఇక చిరంజీవి పార్టీ పెట్టకుముందు, తరువాత కూడా తనతో బాగానే ఉన్నారని.. కానీ ఆయన పార్టీ పెట్టడం వల్ల తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేకపోయాను అంటూ చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు.

రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమని చంద్రబాబు స్పష్టంచేశారు. సినిమా టికెట్లపై మాట్లాడే ముఖ్యమంత్రి భవన నిర్మాణంపై ఎందుకు మాట్లాడరన్నారు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వ‌ర్మ గ‌తంలో తాను తీసిన కొన్ని సినిమాల‌లో చంద్ర‌బాబుని, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ని త‌క్కువ‌గా చేసి చూపించిన విష‌యం తెలిసిందే.

ఇక సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు చంద్ర‌బాబు. నిన్న-మొన్న కూడా భారతీ సిమెంట్ ధరలు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డి పీడితులే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పిందని వాపోయారు.