Chalapathi Rao : బయపెట్టి, నవ్వించి.. కంటతడి పెట్టించిన చలపాయ్.!
NQ Staff - December 25, 2022 / 02:06 PM IST

Chalapathi Rao : చలపతిరావు సీనియర్ నటుడు. చాలామంది నటుల్లో ఆయన వెరీ వెరీ స్పెషల్. ఇప్పుడంటే, సింగిల్ సినిమాకే స్టార్లయిపోయి.. కాలర్ ఎగరేసేస్తున్నారు. కానీ, ఒకప్పటి పరిస్థితి వేరు. నటన అంటే ప్యాషన్. గుర్తింపు కోసం ప్రతిసారీ అంతకు మించి కష్టపడేవారు.
ముక్కుసూటి మనిషిగా చలపతిరావు గురించి చెబుతారు. తెరపై రేపిస్టుగా చలపతిరావు ఓ తరాన్ని భయపెట్టారనడం అతిశయోక్తి కాదేమో. రియల్ లైఫ్‌లో ఆయన ఎంతో సౌమ్యుడని చెబుతుంటారు.
భయం.. హాస్యం..
వెండితెరపై భయంకరమైన పాత్రల్లో నటించి మెప్పించారు చలపతిరావు. అంతే కాదు, కామెడీ రోల్స్‌లో కడుపుబ్బా నవ్వించారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో పవర్ ఫుల్ రోల్ పోషించారుగానీ.. కంటతడి పెట్టించే సన్నివేశంలో మెప్పించారు.
1200 సినిమాలంటే మాటలు కాదు. ఈ తరం నటీనటుల్లో ఎంతమందికి ఆ అవకాశం దక్కుతుంది.? ఎంతమందిలో ఆ సమర్థత వుంది.? పోయినోళ్ళంతా మంచోళ్ళే.. అని పెద్దలంటారు. కానీ, చలపతిరావు లాంటోళ్ళు నిజంగానే గొప్పోళ్ళు.. గొప్ప నటులు.!