Suriya Karthi : త‌మిళ స్టార్స్ సంక్రాంతి సంద‌డి చూసి మురిసిపోతున్న అభిమానులు

Suriya Karthi : మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరిస్తుంటాయి.తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జ‌రుపుకుంటున్నారు.

Brothers Suriya Karthi celebrating Pongal
Brothers Suriya Karthi celebrating Pongal

సామాన్యుల‌తో పాటు సెల‌బ్స్ కూడా ఈ వేడుక‌ల‌లో పాల్గొంటూ సంద‌డి చేస్తున్నారు. మోస్ట్ అడోబ‌ర‌బుల్ క‌పుల్ సూర్య‌, జ్యోతిక కూడా సంక్రాంతిని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా కొనసాగుతుండగా.. జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

పండగ స్పెషల్ గా ఈ అడోరబుల్ జంట తమ అందమైన ఫోటోను షేర్ చేస్తూ అందరికి భోగీ శుభాకాంక్షలు తెలిపారు.. భోగీ మంటలు వేసి.. ఆ మంటలపై పొంగలి కాస్తూ ఈ జంట కనిపించారు. బ్లూ కలర్ కుర్తాలో సూర్య.. వైట్ కలర్ శారీ లో జ్యోతిక సింపుల్ గా ఉన్నా ఎంతో అందంగా ఉన్నారు.

ఈ వేడుక‌లో సూర్య సోద‌రుడు కార్తీ కూడా పాల్గొన్నారు. పంచె క‌ట్టి అద‌ర‌హో అనిపించారు. ప్ర‌స్తుతం వీరి పిక్స్ వైర‌ల్‌గా మారాయి. ఎల్లప్పుడూ వీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

చిరంజీవి, రోజా,వైఎస్ జ‌గ‌న్, బాల‌కృష్ణ వంటి ప్ర‌ముఖులు కూడా సంక్రాంతి పండుగ‌ని స‌ర‌దాగా జ‌ర‌పుకున్నారు. వీరి వేడుక‌ల‌కి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా కాగా, వీటిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.